Begin typing your search above and press return to search.

ఏటీఎం (ATM)... థ్రిల్లింగ్ రైడ్‌

By:  Tupaki Desk   |   21 Jan 2023 6:24 AM GMT
ఏటీఎం (ATM)... థ్రిల్లింగ్ రైడ్‌
X
దేశంలోని ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ZEE5లో స్ట్రీమింగ్ అవుతున్న లేటెస్ట వెబ్ సిరీస్ ATM. స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ క‌థ‌ను అందించ‌టంతో పాటు షో ర‌న్న‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన ఈ సిరీస్‌ను దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ రూపొందించింది. హైద‌రాబాద్ బేస్డ్‌గా సిరీస్ తెర‌కెక్కింది.

ఇంత‌కీ ఈ వెబ్ సిరీస్ దేని గురించి చెబుతుందో తెలుసా .. జ‌గ‌న్ (వి.జె.స‌న్ని), కార్తీక్ (కృష్ణ‌), అభ‌య్ (ర‌విరాజ్‌), హ‌ర్ష (రోయ‌ల్ శ్రీ) అనే న‌లుగురు కుర్రాళ్లు మురికి వాడ‌ల్లో పుట్టి పెరుగుతారు. వారికి విలాస‌వత‌మైన జీవితాన్ని గ‌డ‌పాల‌నే కోరిక క‌లుగుతుంది. దాని కోసం వారు చిన్న చిన్న‌ నేరాలను చేస్తుంటారు. వారెప్పుడూ భారీ దొంగ‌త‌నాల‌ను చేయాల‌ని అనుకోరు. కానీ జీవితంలో వారు ఊహించ‌ని ప‌రిణామం ఎదుర‌వుతుంది.

ఓ లోక‌ల్ స్మ‌గ్ల‌ర్ త‌న కారుని అమ్మే స‌మ‌యంలో ప‌ది కోట్ల రూపాయ‌ల విలువైన వ‌జ్రాల‌ను పోగొట్టుకుంటాడు. అదే స‌మ‌యంలో న‌లుగురు కుర్రాళ్ల‌కు డ‌బ్బులు బాగా అవ‌స‌రం అవుతాయి. ప‌ది రోజుల్లోనే వారు కోట్ల రూపాయ‌ల‌ను సంపాదించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. వారికి మ‌రో దారి లేక బ‌ల‌హీనమైన త‌ప్పుడే మార్గాన్నే ఎంచుకుంటారు.

రైట‌ర్, డైరెక్ట‌ర్ చంద్ర మోహ‌న్ ఈ సిరీస్‌ను ముందుకు న‌డిపించిన తీరు చూస్తే త‌ప్ప‌క అభినందించాల్సిందే. క‌థ‌ను ఆయ‌న న‌డిపిన తీరు మాస్ అంశాల‌తో పాటు మెల్ల మెల్ల‌గా అందులో వేగాన్ని పెంచుతూ అందిలోనూ తెలియ‌ని ఓ ఆస‌క్తిని రేపారు. ఏటీఎం దోపిడి చుట్టూ ఈ సిరీస్ ర‌న్ అవుతుంది. ప‌ద‌వీ కాంక్ష‌తో ర‌గిలిపోయే గ‌జేంద్ర (థర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ) అనే రాజ‌కీయ నాయ‌కుడు... క్ష‌మించ‌టం తెలియ‌ని పోలీస్ ఆఫీస‌ర్ హెగ్డే (సుబ్బ‌రాజు) మ‌ద్య ఈ గేమ్ సాగుతుంది. కప్పులోని చాయ్‌, ప్లేటులోని మైసూరు బొండా గురించి పాత్ర‌లు మాట్లాడే తీరు న‌వ్విస్తాయి. వారి జీవితాలు పైకి క‌నిపించేంత సులువు కాద‌నే విష‌యాన్ని కూడా మ‌న‌కు తెలియ‌జేస్తాయి.

ఏటీఎం సిరీస్‌ను న‌డిపించిన తీరుని త‌ప్ప‌కుండా అభినందించాల్సిందే. ఈ టైటిల్ నేటి బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌ను సూచించేదే కాదు.. న‌లుగురు యువ‌కుల మ‌ధ్య ఉన్న స్నేహాన్ని తెలియ‌జేస్తుంది. అలాగే వారు ఏ విష‌యాన్ని తేలిక‌గా తీసుకోరు. వారి వేసే ప్ర‌ణాళిక‌ల్లో ప్లాన్ బితో ముగియ‌వు. అవి జెడ్ వ‌ర‌కు సాగుతాయ‌ని తెలుస్తుంది.

8 ఎపిసోడ్స్ ఉన్న ఏటీఎం సిరీస్‌లో న‌టీన‌టులు పెర్ఫామెన్సెస్ అద్భుతంగా కుదిరాయి. స‌న్నివేశాల్లో నెక్ట్స ఏం జ‌రుగుతుంద‌నే క్యూరియాసిటీని న‌టీన‌టుల‌ను అద్భుతంగా ఆవిష్క‌రించారు. వారి డైలాగ్ డెలివ‌రీ, న‌ట‌న ఆక‌ట్టుకుంటాయి. దివి పోషించిన లేడీ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌ను ఎంజాయ్ చేస్తారు. ప్ర‌శాంత్ ఆర్‌. విహారి అద్భుత‌మైన సంగీతంతో పాటు ఎక్స‌లెంట్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను కూడా అందించారు. ఇక సినిమాటోగ్ర‌ఫీ, ఎడిటింగ్ దేనిక‌వే గొప్ప‌గా నిలుస్తున్నాయి.

సిరీస్ ఫైన‌ల్ ఎపిసోడ్‌లో ఏటీఎం సీజ‌న్ 2 ఉంటుంద‌ని తెలియ‌జేశారు మేక‌ర్స్‌.

"ఏటీఎం (ATM)" ని "జీ 5 (ZEE5)" లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://zee5.onelink.me/RlQq/ATM



Content Produced by Indian Clicks, LLC