Begin typing your search above and press return to search.

'ఇప్పుడు కాక ఇంకెప్పుడు' డిజిటల్ - శాటిలైట్ రైట్స్ తీసుకున్న జీ గ్రూప్..!

By:  Tupaki Desk   |   27 Jun 2021 9:00 AM IST
ఇప్పుడు కాక ఇంకెప్పుడు డిజిటల్ - శాటిలైట్ రైట్స్ తీసుకున్న జీ గ్రూప్..!
X
హశ్వంత్ వంగా - నమ్రత దరేకర్ - కాటలైన్ గౌడ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'ఇప్పుడు కాక ఇంకెప్పుడు'. చింతా రాజశేఖర్ రెడ్డి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా ఈ సినిమా రూపొందుతోంది. వై.యుగంధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చింతా గోపాలకృష్ణ (గోపి) నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ ఈ రోమ్-కామ్ పై ఆసక్తిని కలిగించాయి.

'ఇప్పుడు కాక ఇంకెప్పుడు' చిత్రానికి సంబంధించిన శాటిలైట్ మరియు డిజిటల్ హక్కులను 'జీ' గ్రూప్ కు చెందిన జీ తెలుగు - జీ సినిమాలు - జీ5 సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని తాజాగా వెల్లడించిన మేకర్స్.. ఓ బ్యూటిఫుల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇందులో హీరో కౌగిలిలో హీరోయిన్ ఒదిగిపోయి కనిపిస్తుంది. కాగా, చిన్నప్పటి నుంచి అమ్మాయిలకు దూరంగా పెరిగిన అబ్బాయికి.. అబ్బాయిలకు దూరంగా పెరిగిన అమ్మాయికి మధ్య జరిగిన రొమాంటిక్ జర్నీయే ఈ సినిమా కథ అని తెలుస్తోంది.

ఈ చిత్రంలో పూజా రామచంద్రన్ - తనికెళ్ల భరణి - తులసి - రాజారవీంద్ర తదితరులు నటించారు. సాహిత్య సాగర్ సంగీతం అందిస్తున్నాడు. జెమిన్ జామ్ అయ్యనేథ్ సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకాంత్ పట్నాయక్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. 'ఇప్పుడు కాక ఇంకెప్పుడు' చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.