Begin typing your search above and press return to search.

సెక్సీ బ్యూటీ 'స్ర్కిప్ట్ చదువుతోంది' అనుకోండే

By:  Tupaki Desk   |   12 May 2018 7:34 AM GMT
సెక్సీ బ్యూటీ స్ర్కిప్ట్ చదువుతోంది అనుకోండే
X
వరుసగా సినిమాలు చేసేసిన తర్వాత.. మధ్యలో బ్రేక్ వస్తే ఆ యాక్టర్లకు మహా చిరాగ్గా ఉంటుంది. అటు ప్రాజెక్టులు చేజిక్కించుకోలేరు.. ఇటు తమ దగ్గరకు సినిమాలు రావడం లేదని పైకి చెప్పలేరు. ఈ సిట్యుయేషన్ నుంచి తప్పించుకునేందుకు రకరకాల టెక్నిక్స్ పాటించేస్తున్నారు అందాల భామలు.

ఇదుగో.. ఈ ఫోటోలో కనిపస్తున్న పాప పేరు జరీన్ ఖాన్. ఎయిర్ పోర్టులో వెళుతూ అలా చేతిలో స్పైరల్ బైండింగ్ బుక్కుతో కనిపించింది. 8-9 ఏళ్లుగా బాలీవుడ్ లో బాగానే సినిమాలు చేస్తోంది. కొన్ని స్పెషల్ అప్పియరెన్స్ లు.. మరికొన్ని లీడ్ రోల్స్.. ఇంకొన్ని క్యామియోలు మొత్తం మీద కెరీర్ బాగానే నెట్టుకొస్తోంది. కానీ ఇప్పుడు జరీన్ ఖాన్.. దాదాపుగా ఫేడవుట్ అవుతున్న పొజిషన్ కు వచ్చేసింది. హేట్ స్టోరీ3.. వజహ్ తుమ్ హో అంటూ అడల్ట్ కంటెంట్ సినిమాలు చేసినా ఆశించిన స్థాయి క్రేజ్ ను తెచ్చుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయింది జరీన్.

ఇప్పుడు ఎయిర్ పోర్టులో బౌండు బుక్కులు పట్టుకోవడంలో సీక్రెట్ ఏంటంటే.. ఈ మధ్యన ఇలా బుక్స్ క్యారీ చేయడం ఫ్యాషన్ అయిపోయింది. చేతిలో ఇలా ఒక బౌండ్ బుక్ ఉంటే.. 'స్ర్కిప్టులు చదువుతోంది' అనుకుంటారని వీళ్ళ ఫీలింగ్. జనాలు వీళ్లకంటే బాగా ముదిరిపోయారనే విషయం.. వీళ్లు ఎప్పటికి తెలుసుకుంటారో ఏమో?