Begin typing your search above and press return to search.

పబ్లిగ్గా చెంప పగులకొట్టిన హీరోయిన్

By:  Tupaki Desk   |   17 Dec 2018 4:49 PM IST
పబ్లిగ్గా చెంప పగులకొట్టిన హీరోయిన్
X
హేట్ స్టోరీ 3, వీర్ లాంటి చిత్రాల్లో మెప్పించిన బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ మరో వివాదంలో చిక్కుకుంది. తాజాగా ఔరంగాబాద్లో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఓ ఎంటర్ టైన్ మెంట్ పోర్టల్ లాంచ్ సందర్భంగా జరీన్ ఖాన్ సహనం కోల్పోయి ప్రవర్తించడం విమర్శలకు తావిచ్చింది.

బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ రావడంతో ఆ ప్రాంతానికి అభిమానులు పోటెత్తారు. వారిని అదుపు చేయడంలో పోలీసులు, నిర్వాహకులు విఫలమయ్యారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. చాలా మంది అభిమానులు ఆమె మీద పడ్డారు. దీంతో ఆగ్రహంతో జరీన్ ఖాన్ ఒక అభిమాని చెంప చెళ్లుమనిపించింది. పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. జరీన్ ఖాన్ ను సురక్షితంగా కారు ఎక్కించి పంపించారు. కానీ జరీన్ ఖాన్ చెంప చెల్లుమనిపించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీనిపై జరీన్ ఖాన్ కూడా స్పందించింది. అభిమానులు తన మీద పడ్డప్పుడు ఒక బుద్దిలేని వెదవ తనను తాకరాని చోట తాకాడని.. అందుకే వాడి చెంప పగులకొట్టానని వివరణ ఇచ్చింది. ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కూడా జరీన్ కారు ఓ బైక్ ను ఢీకొనడంతో అతడు మరణించాడు. జరీన్ కారు డ్రైవర్ పై కేసు నమోదైంది. జరీన్ మేనేజర్ కూడా అసభ్య సందేశాలు పంపి కేసుల పాలయ్యారు. ఇప్పుడు ఈమె కూడా వివాదాలతో వార్తల్లో నిలిచింది.