Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: కాలా బ్యూటీ ఖతర్నాక్ పోజు

By:  Tupaki Desk   |   2 Sep 2019 11:35 AM GMT
ఫోటో స్టొరీ: కాలా బ్యూటీ ఖతర్నాక్ పోజు
X
బాలీవుడ్ లో ఉన్న హాటు బ్యూటీలలో హుమా ఖురేషి ఒకరు. సూపర్ స్టార్ రజనీకాంత్ 'కాలా' లో ఒక కీలక పాత్రలో నటించి సౌత్ ప్రేక్షకులకు కూడా పరిచయం అయింది. ఇక హిందీలో ఆమె లిస్టులో 'గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ 1 & 2'.. 'D-డే'.. 'బద్లాపూర్'.. 'హైవే'.. 'జాలీ ఎల్ఎల్ బీ 2' లాంటి సినిమాలు ఉన్నాయి. హుమా నటించిన సినిమాలన్నీ దాదాపుగా స్ట్రాంగ్ కంటెంట్ ఉండేవే. హుమా మిగతా హిందీ సుందరీమణుల తరహాలోనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ నెటిజన్లతో నిత్యం టచ్ లో ఉంటుంది.

ప్రస్తుతం ఈ భామ లాస్ ఏంజెలెస్ లో ఉందట. అక్కడినుంచి తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. అందులో ఒక ఫోటోకు "గ్లో" అనే క్యాప్షన్ ఇచ్చింది. అర్థం అయింది కదా.. ఫోటోల్లో సూర్యుడి కాంతి పడడంతో హుమా నిజంగానే మెరుస్తూ ఉంది. ఈ ఫోటోలో హుమా వైట్ కలర్ లో ఉండే ఒక లాంగ్ కోటు వేసుకుంది. డీప్ వీ నెక్.. థై స్లిట్ ఉండడంతో ఫుల్ హాట్ గా కనిపిస్తోంది మెట్లమీద స్టైలిష్ గా నిలబడి పోజివ్వడం.. బంగారు రంగులో ఉండే భానుడి లేలేత కిరణాలు హుమాపై పడడంతో ఒక సెన్సువల్ ఫీల్ వచ్చింది. హాట్ గా కనిపించడంతో పాటుగా హుమా ఇచ్చిన స్టైలిష్ పోజులు కూడా ఫోటోలను స్పెషల్ గా మార్చాయి.

ఈ ఫోటోలకు అదితి రావ్ హైదరీ.. రియా చక్రవర్తి లాంటి భామలు లైక్స్ వేసుకున్నారు. ఇక సాధారణ నెటిజన్లు కూడా కిరాక్ కామెంట్స్ పెట్టారు. "ఎక్ దమ్ ఝకాస్".. "బియాండ్ స్టన్నింగ్".. "ఉఫ్ క్యా అదా హై".. "క్వీన్ ఆఫ్ హాట్ నెస్" అంటూ పొగడ్తలు కురిపించారు. ఇక సినిమాల విషయానికి వస్తే హుమా ప్రస్తుతం 'ఆర్మీ ఆఫ్ ది డెడ్' అనే హాలీవుడ్ హారర్ ఫిలిం లో నటిస్తోంది.