Begin typing your search above and press return to search.

హేట్ భామకు లైవ్ లో ప్రపోజల్

By:  Tupaki Desk   |   11 March 2017 12:01 PM GMT
హేట్ భామకు లైవ్ లో ప్రపోజల్
X
సినిమా తారలను ఇష్టపడ్డం.. ప్రేమించేయడం అనేది మన దగ్గర ఎప్పటి నుంచో ఉన్న సంస్కృతే. అయితే.. విపరీతంగా ఆరాధించిన అందాల భామకు.. తమ ప్రేమను వెల్లడించే అవకాశం అందరికీ రాదు. వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని ఫిక్స్ అయ్యాడా యువకుడు.

అందుకే లైవ్ లోనే జరీన్ ఖాన్ కు ఐలవ్యూ చెప్పేశాడు. ఇండియన్ ఐడల్ కార్యక్రమం జరుగుతుండగా.. దీన్ని ఫరా ఖాన్ జడ్జ్ గా వ్యవహరిస్తోంది. ఈ మ్యూజిక్ రియాల్టీ షోకి హీరోయిన్ జరీన్ ఖాన్ ని స్పెషల్ గెస్ట్ గా ఆహ్వానించింది ఫరా ఖాన్. జరీన్ ను తను పాల్గొంటోన్న ఎపిసోడ్ లో చూసిన ఓ కుర్రాడు.. ముసి ముసి నవ్వులు నవ్వేసుకుని విపరీతమైన ఆనందాన్ని ఫీలయిపోయాడు. అలౌకిక ఆనందాన్ని కళ్లలోనే చూపించేశాడు. ఇదంతా గమనించిన ఫరా ఖాన్.. అతనికి ఓ అవకాశం ఇచ్చింది.

తనకు దక్కిన అరుదైన అవకాశాన్ని ఏ మాత్రం మిస్ చేసుకోలేదు ఆ ఇండియన్ ఐడల్ కంటెస్టెంట్. ఎంచక్కా పాట పాడుతూ జరీన్ ఖాన్ కు ప్రపోజ్ చేసేశాడు. మోకాళ్లపై వంగి మరీ కుర్రాడు చేసిన ప్రపోజల్ కి ఎవరైనా లొంగాల్సిందే. అంతగా తన ప్రేమను ఎక్స్ ప్రెస్ చేశాడు. ఆ సమయంలో హేట్ స్టోరీ హీరోయిన్ జరీన్ ఖాన్ మొహంలో ఫీలింగ్స్ అదరహో అనాల్సిందే. ఈ ఎపిసోడ్ మొత్తానికి ఈ సన్నివేశమే హైలైట్ గా నిలిచింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/