Begin typing your search above and press return to search.

ఆ పిల్ల చేసిన తప్పేంటో తెలియట్లేదు

By:  Tupaki Desk   |   17 Jan 2017 4:40 AM GMT
ఆ పిల్ల చేసిన తప్పేంటో తెలియట్లేదు
X
ఇప్పుడు ట్విట్టర్ అండ్ ఫేస్ బుక్ అనేవి సరదాగా సోషలైజ్ కావడానికి ఉపయోగబడుతున్న సాధనాలుగా కాకుండా విషం చిమ్మేసే యుద్ధ భూముల్లా మారిపోతున్నాయి. మొన్నటికిమొన్న త్రిష కు చుక్కలు చూపించేశారు.. ట్విట్టర్లో ఉండే చదువుకున్న మూర్ఖులు. ఇక ఫ్యాన్ వార్స్ సంగతి చెప్పక్కర్లేదు. వీరు కనీసం ఒక యంగ్ చైల్డ్ ఆర్టిస్టును కూడా వదట్లేదంటే చూస్కోండి మరి.

'దంగల్' సినిమాలో 16 ఏళ్ళ చైల్డ్ ఆర్టిస్ట్ జైరా వాసిమ్.. చిన్ననాటి గీతా ఫోగట్ పాత్రను పోషించింది. దాదాపు 40% సినిమాలో కనిపించే ఈ యంగ్ పాత్రలో.. ఆ పిల్ల అదరగొట్టేసిందనే చెప్పింది. అయితే రీసెంట్ గా ఈ అమ్మాయి జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ని కలిసింది. అంతే చూస్కోండి.. ఇక ట్రాల్స్ తమ విశ్వరూపం చూపించేశారు. ట్విట్టర్ అండ్ ఫేస్ బుక్కులో ఈమెను రఫ్పాడించేశారు. కేవలం ఒక ముస్లింవి అని చెప్పి నువ్వు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిని కలిసావా? అంటూ మొదలెట్టి.. అసలు నువ్వు ఏమంత చేసేశావ్ అని ఇలా ముఖ్యమంత్రులను కలవడానికి అంటూ పంచ్ లు వేసేశారు. ఈ దెబ్బకి ఆ పిల్ల ఫేస్ బుక్ సాక్షిగా మరోసారి అపాలజీ చెప్పాల్సి వచ్చింది.

''దయ చేసి నేనే ఏదైనా తప్పు చేశానని అనుకుంటే నన్ను క్షమించండి. నాకు తెలిసి నేను ఎవ్వరినీ హర్ట్ చేయాలని అనుకోవట్లేదు. అలాగే హర్టు చేయడం నా ఉద్దేశ్యం కూడా కాదు. అందుకే ఇప్పుడు సారీ చెబుతున్నాను. ప్లీజ్ నన్ను అపార్ధం చేసుకోవద్దు'' అంటూ జైరా వాసిమ్ ఒక పోస్టు చేసింది. ఈ పోస్టును ఔట్ ఆఫ్‌ ప్రొపర్షన్ కూడా బ్లో అవుట్ చేయొద్దంటూ మీడియాను కోరుకుంది. అసలు ఒక చైల్డ్ ఆర్టిస్టుకు ఇలాంటి పరిస్థితి తీసుకురావడం సమంజసమేనా? కేవలం ఒక ముస్లిం ముఖ్యమంత్రిని కలిస్తే ఆమె తప్పు చేసినట్లేనా? ఏందయ్యా సామీ!!


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/