Begin typing your search above and press return to search.

సీక్రెట్ కాదు.. ఓపెన్ సూపర్ స్టారే!!

By:  Tupaki Desk   |   24 Oct 2017 5:57 PM GMT
సీక్రెట్ కాదు.. ఓపెన్ సూపర్ స్టారే!!
X
జైరా వసీం.. ఇప్పుడు ఈ పేరు తెలియని యంగస్టర్స్ ఇండియాలో ఉండరనే అనుకోవాలి. ఎందుకంటే ఈ 16 ఏళ్ళ పిల్ల.. దంగల్ సినిమా తరువాత అంత పాపులర్ అయిపోయింది. అయితే ఆ సినిమాతో వచ్చిన క్రేజును వెంటనే తరువాతి స్థాయికి తీసుకెళుతూ.. ''సీక్రెట్ సూపర్ స్టార్'' సినిమాలో ఏకంగా లీడ్ రోల్ చేసేసింది. రెండోసారి అమీర్ ఖాన్ తో నటించేసింది.

ఇప్పుడు ఈ పిల్ల తన సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి ఇస్తున్న ఇంటర్యూలు చూస్తే మాత్రం మతిపోతోంది. ఎందుకంటే అమ్మడు కేవలం కాశ్మీర్ లో 10వ తరగతి వరకు చదివాను అని చెబుతూ.. ఇంగ్లీషులో దంచేస్తోంది. అంతేకాదు.. చాలామంది క్రిటిసైజ్ చేస్తుంటారు కదా అంటే.. ఒకప్పుడు పట్టించుకునేదాన్ని ఇప్పుడైతే మాత్రం అస్సలు కేర్ చేయట్లేదు.. ఎవరేమనుకుంటే నాకేంటి.. నేను మాత్రం మంచి వర్క్ చేస్తాను అంతే.. అంటోంది. ఫ్యూచర్లో బాలీవుడ్ లో తాను కూడా ఒక గ్లామరస్ హీరోయిన్ అవ్వాలని చెబుతూనే.. తాను సీక్రెట్ సూపర్ స్టార్ కాదు ఓపెన్ సూపర్ స్టార్ అవ్వాల్సిందే అన్నట్లు ఓపెన్ అయిపోయింది.

నిజానికి ఇంత చిన్న వయస్సులో ఈమె మెట్యూరిటీ చూస్తుంటే మాత్రం.. ఖచ్చితంగా సూపర్ స్టార్ అయ్యేలాగానే ఉంది. కాకపోతే బాలనటులుగా సక్సెస్ అయ్యి.. తరువాత పెద్ద పెద్ద హీరోయిన్ అయినవారు బాలీవుడ్లో చాలా తక్కువమందే ఉన్నారు. శ్వేతా బసు.. అవికా గోర్ వంటి భామలు ఇంకా హీరోయిన్లు అవ్వలేకపోతున్నారు. మరి జైరా వసీం ఏం చేస్తుందో చూడాలి.