Begin typing your search above and press return to search.
వైరల్ అవుతున్న యువసామ్రాట్ లేటెస్ట్ ట్రెండీ లుక్..!
By: Tupaki Desk | 7 Jun 2021 10:00 PM ISTటాలీవుడ్ సూపర్ కూల్ హీరో నాగచైతన్య.. ఇటీవలే ఇటలీ దేశంలో 'థాంక్యూ' మూవీ మెయిన్ షెడ్యూల్ పూర్తి చేసుకొని ఇండియాకు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లోనే షూట్ చేయనున్నారు. ఆ ఒక్క షెడ్యూల్ తో థాంక్యూ సినిమా మొత్తం షూటింగ్ ముగిసినట్లే అవుతుంది. మనం సినిమాతో అక్కినేని ఫ్యామిలీకి అద్భుతమైన సినిమా అందించిన విక్రమ్ కే కుమార్.. థాంక్యూ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అలాగే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే హీరో నాగచైతన్య వీలైనంత త్వరగా థాంక్యూ షూటింగ్ పూర్తిచేసి వెంటనే తదుపరి సినిమాలు కూడా లైన్ చేసే ఆలోచనలో ఉన్నారట.
అయితే తాజాగా నాగచైతన్య నటిస్తున్న థాంక్యూ మూవీ నుండి న్యూ లుక్ రివీల్ చేశారు మేకర్స్. గుబురు గడ్డంతో చైతూ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. అలాగే తాజా సమాచారం ప్రకారం.. థాంక్యూ సినిమాలో చైతూ క్యారెక్టర్ మూడు డిఫరెంట్ షేడ్స్ కలిగి ఉంటుందని.. అందులో ఈ గడ్డం లుక్ ఒకటని టాక్. మరి నిజంగానే సినిమాలో త్రీ షేడ్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అక్కినేని అభిమానులకు థాంక్యూ బిగ్ ట్రీట్ అవుతుంది. అయితే ఈ సినిమాలో చైతు క్యారెక్టర్ యవ్వనం నుండి ఉంటుందట. యవ్వనంగా కనిపించేందుకు ఇదివరకు ఓ లుక్ రివీల్ చేసిన సంగతి విదితమే. మరి ప్రస్తుతం చైతూ లుక్ చూసి యువసామ్రాట్ అంటూ ఫ్యాన్స్ పిలుచుకుంటున్నారు.
ఇక థాంక్యూ సినిమాలో నాగచైతన్య సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉండగా.. చైతూ తెలుగు మాత్రమే కాకుండా త్వరలోనే బాలీవుడ్ డెబ్యూ కూడా చేయబోతున్నాడు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న 'లాల్ సింగ్ చద్దా' మూవీలో నాగచైతన్య ఓ కొత్త అవతారంలో కనిపించనున్నాడు. అందుకోసం బాడీని మేకోవర్ చేయాల్సిన అవసరం ఉందట. అయితే థాంక్యూ సినిమాలో త్రీ షేడ్స్ కోసం కూడా చైతూ బాడీ మేకోవర్ చేసినట్లు తెలుస్తుంది. ఇదేగాక ప్రస్తుతం చైతూ ఆల్రెడీ పూర్తి చేసినటువంటి లవ్ స్టోరీ మూవీ రిలీజ్ గురించి కూడా వెయిట్ చేస్తున్నాడు. సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాపై ఆల్రెడీ ప్రేక్షకులలో మంచి బజ్ క్రియేట్ అయింది. చూడాలి మరి త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారేమో!