Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: పవర్ ఫుల్ గా పవర్ స్టార్ 'యువరత్న'

By:  Tupaki Desk   |   20 March 2021 4:21 PM GMT
ట్రైలర్ టాక్: పవర్ ఫుల్ గా పవర్ స్టార్ యువరత్న
X
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ - సయేషా సైగల్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న తాజా చిత్రం ''యువ‌ర‌త్న'' (ది పవర్ ఆఫ్ యూత్). ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కి సంతోష్ ఆనంద్రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. 'కేజీఎఫ్' చిత్రాన్ని నిర్మించిన విజ‌య్ కిర‌గందూర్.. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఏప్రిల్‌ 1న ఈ సినిమాని అదే పేరుతో తెలుగులో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘యువరత్న’ ట్రైలర్‌ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

'ఎడ్యుకేషన్ అనేది బిజినెస్ కాదు.. అదొక సర్వీస్.. ఒక కాలేజ్ గొప్పదయ్యేది ఫీజ్ వల్లో డోనేషన్ వల్లో కాదు.. స్టూడెంట్స్ వల్ల' అంటూ ప్రకాశ్ రాజ్ చెప్పే డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. ఎడ్యుకేషన్ ప్రైవేటైజేషన్.. కాలేజీలలో జరిగే అసాంఘిక కార్యకలాపాలు.. డ్రగ్స్‌ వంటి అంశాలను సినిమాలో ప్రస్తావించినట్టు ట్రైలర్‌ చూస్తే అర్థమౌతోంది. 'ఫస్ట్‌ బెంచ్‌ లో కూర్చుంటే బోర్డు మాత్రమే కనిపిస్తుంది.. అదే లాస్ట్‌ బెంచ్‌ లో కూర్చుంటే వరల్డ్ కనిపిస్తుంది' 'టెంపర్ తగ్గించుకోడానికి అది బీపీ షుగర్ కాదు.. యాటిట్యూడ్' అంటూ పునీత్ చెప్తున్న డైలాగ్స్ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి.

అలానే ఈ చిత్రంలో యాక్షన్ పాళ్లు చాలా ఎక్కువే ఉన్నట్లు తెలుస్తోంది. ధ‌నంజ‌య్ విలన్ గా కనిపిస్తుండగా.. సాయి కుమార్ - సోనూ గౌడ‌ - దిగంత్ మంచ‌లే ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. దీనికి థమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్.. వెంకటేష్ అంగురాజ్ సినిమాటోగ్రఫీ స్పెషల్ గా ఉన్నాయి. మొత్తం మీద పవర్ స్టార్ నటించిన ఈ పవర్ ఫుల్ యాక్షన్ ట్రైలర్ ప్రేక్షకులను అలరోస్తోంది. పునీత్‌ రాజ్‌ కుమార్‌ తొలిసారి డైరెక్ట్‌ తెలుగులో చేస్తున్న 'యువరత్న' ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.