Begin typing your search above and press return to search.

యువీ పై అతని భార్య ఆగ్రహం..ఆ వీడియోనే కారణమట!

By:  Tupaki Desk   |   10 July 2020 12:33 PM IST
యువీ పై అతని భార్య ఆగ్రహం..ఆ వీడియోనే కారణమట!
X
టీం ఇండియా మాజీ ఆటగాడు , స్టార్ అల్ రౌండర్ యువరాజ్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్కసారి గ్రౌండ్ లో దిగి ఫామ్ అందుకున్నాడు అంటే అవతలి వైపు ఎలాంటి బౌలర్ ఉన్నా కూడా ఆకాశం వైపు చూడాల్సింది. ప్రేక్షకులు ఫీల్డర్లు గా మారాల్సిందే. యువీ ఒంటి చేత్తో ఎన్నో మ్యాచులని గెలిపించాడు. అలాగే టీం ఇండియా 2011 లో ప్రపంచ కప్ గెలవడంతో యువీ దే కీలక పాత్ర. ఆ టోర్నీ మొత్తం అద్భుతమైన ప్రదర్శన చేసి.. భారత్ అభిమానుల చిరకాల కోరికను నెరవేర్చాడు.

ఇకపోతే , యువీ నిత్యం సోషల్ మీడియా లో ఉంటూ సమాజంలో జరిగే సంఘటనల పై స్పందిస్తూ, తన తోటి ఆటగాళ్లను ట్రోల్ చేస్తూ ఉంటాడు. అలాగే తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉంటాడు. అలా యువీ తాజాగా జిమ్‌ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియో తన ఇన్‌ స్టాగ్రామ్ ‌లో పోస్ట్ చేసాడు. అయితే ఆ వీడియో పై అతని భార్య హాజెల్‌ కీచ్‌ ఆగ్రహం వ్యక్తం చేసారు.

కారణం ఏంటంటే..యువీ పోస్ట్ చేసిన వీడియో బ్యాగ్రౌండ్ ‌లో ఆమె కూడా కనిపిస్తున్నారు. దీనితో 'యువీ.. ఆ వీడియో బ్యాక్‌ గ్రౌండ్ ‌లో నేను కనిపించడం నచ్చలేదు అంటూ కామెంట్ జత చేసారు. దీనితో వెంటనే భార్యా ఆగ్రహాన్నిగమనించి యువరాజ్‌ ఆ వీడియోను డిలీట్ చేసారు. కానీ, ఆలోపే ఆ వీడియో పై మాజీ క్రికెటర్‌ మహ్మద్ కైఫ్‌ స్పందిస్తూ... 'భాయ్‌ నాకు ఆ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ ఇవ్వండి' అని కామెంట్‌ చేశాడు.