Begin typing your search above and press return to search.

20 ఏళ్లలో 125 సినిమాలు

By:  Tupaki Desk   |   25 Jan 2018 2:30 AM GMT
20 ఏళ్లలో 125 సినిమాలు
X
సౌత్ ఇండస్ట్రీలో ఎంత మంది సంగీత దర్శకులు వచ్చినా కూడా కొందరు సీనియర్ దర్శకులకు పోటీని ఇవ్వలేకపోతున్నారు. గత 20 ఏళ్లుగా ఎంతో మంది సీనియర్ దర్శకులు కొంచెం కొంచెంగా మాయమవుతున్నారు. కానీ ఇళయరాజా వారసుడు యువన్ శంకర్ రాజా మాత్రం తన టాలెంట్ తో ఏడాదికి మినిమమ్ 5 సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ కెరీర్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ వెళుతున్నాడు. మెలోడీ అయినా మాస్ అయినా ఆయన బాణీలు డిఫెరెంట్ గా ఉంటాయి.  

ఒక్కో ఇయర్ లో 10-12 సినిమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తండ్రికి తగ్గ తనయుడిగా యువన్ అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లో తన బాణీలకు ప్రాణం పోస్తున్నాడు. 1997లో శరత్‌ కుమార్‌ - నగ్మ జంటగా నటించిన ‘అరవిందన్‌’ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమైన యువన్ శంకర్ రాజా 20 ఏళ్లలో 125 సినిమాలను పూర్తి చేసుకున్నాడు. పోటీ తీవ్రంగా ఉన్న కాలంలో యువన్ 125 మార్క్ ను దాటారంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి.

 కార్తి - బిరియాని చిత్రంతో 100వ చిత్రాలను పూర్తి చేసుకున్న యువన్ విశాల్‌ నటించిన ‘ఇరుంబుతిరై’ సినిమాతో 125 మార్క్ ని టచ్ చేశాడు. ఈ రెండు సినిమాలు తనకు ఎప్పటికి గుర్తుంటాయని యువన్ చెబుతున్నాడు. విశాల్ సినిమా మార్చిలో విడుదల కానుంది. తెలుగులో కూడా ఈ స్టార్ మెలోడీ రాజా పలు సినిమాలకు వర్క్ చేశాడు. పంజా - గోవిందుడు అందరివాడేలే సినిమాలకు సంగీతం అందించాడు. ఇక 2018 లో కూడా యువన్ చాలా సినిమాలకు వర్క్ చేయడానికి సైన్ చేశాడు. దాదాపు 10 సినిమాల వరకు ఒకే చేసినట్లు తెలుస్తోంది.