Begin typing your search above and press return to search.

ఎక్కడ మిస్ ఫైర్ అయ్యింది చైతూ?

By:  Tupaki Desk   |   9 Sep 2017 5:05 PM GMT
ఎక్కడ మిస్ ఫైర్ అయ్యింది చైతూ?
X
నాగ చైతన్య కొత్త సినిమా 'యుద్దం శరణం'కు అసలు పాజిటివ్ రివ్యూ అనేదే రాలేదు. సినిమాలోని స్లో నెరేషన్ జనాలకు నచ్చలేదు. అయితే ఈ రివ్యూలన్నీ మొదటి రోజున ఆటలన్నీ పడేసరికి బయటకు వస్తాయి. కాని ఇప్పుడు విషయం ఏంటంటే.. అసలు ఈ సినిమాను జనాల్లోకి ఎక్కించడంలోనే ఈ సినిమా మేకర్లు ఫెయిల్ అయ్యారని అంటున్నారు విశ్లేషకులు. అందుకు తొలిరోజు కలక్షన్లే సాక్ష్యం.

మొన్నామధ్యన వచ్చిన 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాను.. ఇప్పుడు 'యుద్దం శరణం'ను రిలీజ్ చేసినట్లే గ్రాండుగా రిలీజ్ చేశారు. అయితే ఆ సినిమాకు తొలిరోజు యావరేజ్ టాక్ వచ్చినా.. ఆల్రెడీ తొలిరోజు ఆటలన్నీ ముందే బుక్ అయిపోతాయి కాబట్టి.. మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా కలుపుకున 4+ కోట్ల షేర్ వచ్చింది. ఇప్పుడు 'యుద్దం శరణం' సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా.. తొలిరోజు అదే రేంజులో షేర్ రావాలి. కాని అనూహ్యంగా కేవలం 1.9+ కోట్లు షేర్ మాత్రమే వచ్చింది. అంటే సినిమాకు అనుకున్నంత హైప్ రాకపోవడం.. అలాగే సినిమాను అనుకున్న స్థాయిలో ప్రమోట్ చేయకపోవడమే ముఖ్య కారణం అంటున్నారు ట్రేడ్ పండితులు.

అసలు ఇలా తొలిరోజు కలక్షన్లు ఒక స్టార్ హీరో విషయంలో ఎప్పుడూ మిస్ ఫైర్ అవ్వకూడదు. మామూలుగా పవన్.. మహేష్‌.. చరణ్‌ వంటి స్టార్లకు సినిమాలు ఫ్లాపైనా కూడా తొలిరోజు కలక్షన్లు మాత్రం రికార్డులకు చేరువలో ఉంటాయి. అలా క్రౌడ్ ను పుల్ చేయాలంటే.. కాస్త గట్టిగానే ప్రమోషన్లూ గట్రా చేయాలి. ఎక్సడ మిస్ ఫైర్ అయ్యిందో ఓసారి సరిచూసుకోవాల్సిందే నాగ చైతన్య అండ్ టీమ్.