Begin typing your search above and press return to search.

యూట్యూబ్ సెన్శేషన్ స్వాతి నాయుడు పెళ్లి అయ్యింది

By:  Tupaki Desk   |   27 Feb 2019 6:44 AM GMT
యూట్యూబ్ సెన్శేషన్ స్వాతి నాయుడు పెళ్లి అయ్యింది
X
తెలుగు యువతకు స్వాతి నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూట్యూబ్‌ సెన్సేషన్‌ గా పేరు తెచ్చుకున్న స్వాతి నాయుడు పెళ్లి చేసుకుంది. విజయవాడలో అవినాష్‌ అనే వ్యక్తిని ఈనెల 23వ తారీకున వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. యూట్యూబ్‌ లో సాఫ్ట్‌ పోర్న్‌ స్టార్‌ గా పేరు పడిన స్వాతి నాయుడు పెళ్లి వార్త ను మొదట అంతా కొట్టి పారేశారు. కాని తానే స్వయంగా మీడియా ముందుకు వచ్చి చెప్పడంతో అంతా నమ్మాల్సి వచ్చింది.

నటిగా గుర్తింపు దక్కించుకోవాలనే కోరికతో ఇంటి నుండి హైదరాబాద్‌ కు చేరిన స్వాతి నాయుడు సినిమాల్లో అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేసింది. అయితే ఆమెకు టాలీవుడ్‌ ఛాన్స్‌ ఇవ్వలేదు. బుల్లి తెరపై కూడా ఆమె ప్రయత్నాలు చేసింది. కాని చిన్న అవకాశం కూడా ఆమెకు దక్కలేదు. నటిగా, యాంకర్‌ గా ప్రయత్నాలు చేసినా కూడా గుర్తింపు రాకపోవడంతో యూట్యూబ్‌ ద్వారా సాఫ్ట్‌ పోర్న్‌ సినిమాలు, షార్ట్‌ ఫిల్మ్స్‌ చేస్తూ వచ్చింది. వందల కొద్ది బూతు చిత్రాలు చేసిన స్వాతి నాయుడు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్‌ అయ్యింది.

స్వాతి నాయుడు కుటుంబం మరియు ఆమె వ్యక్తిగత విషయాల గురించి ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. తాజాగా అవినాష్‌ ను పెళ్లి చేసుకున్నాక ఆమె తన కుటుంబ సభ్యులను సైతం పరిచయం చేసింది. కుటుంబ సభ్యులు మరియు బంధు మిత్రుల సమక్షంలో వైభవంగా స్వాతి నాయుడు పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది. మరి ఈమె ముందు ముందు కూడా సాప్ట్‌ పోర్న్‌ సినిమాలు చేస్తుందా లేదా అనేది చూడాలి.