Begin typing your search above and press return to search.

'రౌడీ బాయ్స్' నుంచి యూత్ ఫుల్ ఎనర్జిటిక్ సాంగ్..!

By:  Tupaki Desk   |   3 Sep 2021 1:11 PM GMT
రౌడీ బాయ్స్ నుంచి యూత్ ఫుల్ ఎనర్జిటిక్ సాంగ్..!
X
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న చిత్రం ''రౌడీ బాయ్స్''. యూత్ పుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో ఆశిష్ సరసన మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - మోషన్ పోస్టర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా టైటిల్ సాంగ్ ని చిత్ర బృందం రిలీజ్ చేసింది.

'మా బాయ్స్ తోటి ఎంట్రీ ఇస్తే అల్లకల్లోలం.. జర ముట్టుకుంటే అంటుకుంటాం అగ్గిపుల్లలం.. ఏం లేకపోయినా మస్తుగా ఉంటాం చాలా ఉన్నోళ్ళం..' అంటూ సాగిన ఈ ర్యాప్ సాంగ్ 'రౌడీ బాయ్స్' సినిమా నేపథ్యాన్ని తెలియజేస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్ లో వచ్చిన ఈ డ్యాన్స్ నంబర్.. యూత్ ని ఉర్రూతలూగించేలా ఉంది. రోల్ రైడా ఈ సాంగ్ నికి ర్యాప్ రాసి స్వయంగా ఆలపించాడు. ఇందులో హీరో ఆశిష్ రెడ్డి ఎనర్జిటిక్ గా వేసిన వేసిన స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి.

'రౌడీ బాయ్స్'' చిత్రానికి 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే లవ్ అండ్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. ఈ చిత్రానికి మధే సినిమాటోగ్రఫీ అందించగా.. మధు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్షిత్ రెడ్డి సహ నిర్మాత. ఈ చిత్రాన్ని అక్టోబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు.