Begin typing your search above and press return to search.

వీరాభిమాని ఆహ్వానపత్రిక స్వీకరించిన యంగ్ టైగర్!

By:  Tupaki Desk   |   16 April 2021 8:00 AM IST
వీరాభిమాని ఆహ్వానపత్రిక స్వీకరించిన యంగ్ టైగర్!
X
టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరోలలో ఒకరు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే హీరోలు కేవలం సినిమాలు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు అభిమానులతో కూడా సమయాన్ని స్పెండ్ చేస్తుంటారు. ఎప్పుడు కలవడానికి టైం కుదరదని చెప్పే హీరోలు కొన్నిసార్లు టైం కేటాయించి మరీ అభిమానుల ఆహ్వానాలు స్వీకరిస్తుంటారు. తాజాగా ఎన్టీఆర్ ఓ వీరాభిమాని ఇచ్చినటువంటి ఆహ్వాన పత్రికను స్వీకరించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి సినిమా హీరోలకు ఫ్యాన్స్, ఫాలోయింగ్.. అభిమాన సంఘాలు, అసోసియేషన్స్ ఇలా బోలెడు విభాగాలు ఉంటాయి. వాటన్నిటికీ ప్రెసిడెంట్స్ ఉంటారు.

తాజాగా ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరో కాదు.. స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ కన్వీనర్ భాస్కర్ చౌదరి. తన కొడుకు భాను పెళ్లికి అభిమాన హీరోను ఆహ్వానించేందుకు పెళ్లి కార్డు పట్టుకొని కుటుంబ సమేతంగా వచ్చారట. ఈ ఫోటోలో ఎన్టీఆర్ చాలా సింపుల్ లుక్కులో కనిపిస్తున్నాడు. కోవిడ్ పరిస్థితి నెలకొనడం వలన ఎన్టీఆర్ ఖరీదైన బ్లాక్ మాస్క్ ధరించి కరోనా ప్రోటోకాల్ పాటించడం మనం చూడవచ్చు. అలాగే బ్లాక్ టి-షర్ట్, క్యాజువల్ ప్యాంటులో సింపుల్ అండ్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు తారక్. ప్రస్తుతం ఎన్టీఆర్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అలాగే ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్ చాలా రోజులకు బయట కనిపించడంతో హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇన్విటేషన్ కార్డు తీసుకుంటూ ఎన్టీఆర్ ఫోటోలకు పోజిచ్చాడు. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ తదుపరి సినిమా కొరటాల శివతో చేయనున్నాడు. ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ మాత్రం అక్టోబర్ 13న రానున్నట్లు ప్రస్తుత సమాచారం.