Begin typing your search above and press return to search.

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సీక్రెట్ ఆప‌రేష‌న్ అలా లీక్

By:  Tupaki Desk   |   12 April 2021 3:30 AM GMT
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సీక్రెట్ ఆప‌రేష‌న్ అలా లీక్
X
ఎన్టీఆర్ ఈ లాక్ డౌన్ లో బ్యాక్ టు బ్యాక్ క‌థ‌ల్ని ఫైన‌ల్ చేసి వ‌రుస‌గా ద‌ర్శ‌కుల్ని లాక్ చేసిన సంగ‌తి తెలిసిందే. అందులో తొలిగా త్రివిక్రమ్ తో సినిమా సెట్స్ కెళ్లాల్సి ఉండ‌గా ఈ సినిమా క‌థ సెట్ కాక పెండింగ్ లో ప‌డింద‌న్న చ‌ర్చా సాగుతోంది. ఆర్.ఆర్.ఆర్ నుంచి రిలీవ్ కాగానే త్రివిక్ర‌మ్ తో సినిమాని ప‌ట్టాలెక్కించేందుకు తార‌క్ సిద్ధంగా ఉన్నారని క‌థ‌నాలొచ్చినా తాజా గుస‌గుసలు అభిమానుల్లో చ‌ర్చ‌కు వ‌చ్చాయి.

త్రివిక్ర‌మ్ - య‌న్టీఆర్ సినిమా కేవ‌లం క‌థ సెట్ అవ్వ‌క‌పోవ‌డం కార‌ణంగానే ఆగిపోయింది. ఇదైతే వాస్త‌వం...! అని టాక్ వినిపిస్తోంది. కానీ ఎ‌న్టీఆర్ మాత్రం ప్ర‌శాంత్ నీల్ .. బుజ్జీ (ప‌ర‌శురామ్)... కొర‌టాల‌ శివ ఇలా కొంద‌రు స్టార్ డైరెక్ట‌ర్స్ తో సినిమాలు చేసుకోవ‌డానికి బ్యాకింగ్ పెట్టుకున్నారు. అయితే వీరంద‌రూ లైన్ లో ఉండ‌గానే.. య‌న్టీఆర్ మ‌రో సీక్రెట్ ఆప‌రేష‌న్ చేశారు. వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్లతో టాలీవుడ్ లో అప‌జ‌య‌మెరుగ‌ని ద‌ర్శకుల జాబితాలో చేరిన అనీల్ రావిపూడి కి తార‌క్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారట‌. రావిపూడి‌ వినిపించిన లైన్ ని ఓకే చేశార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఎఫ్ 3 షూటింగ్ పూర్త‌యిన‌ వెంట‌నే య‌న్టీఆర్ - అనీల్ రావిపూడి కాంబినేష‌న్ లో సినిమా ఉంటుంద‌ని దీనికి సంబంధించిన వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారని తెలుస్తోంది. మొత్తం మూడు బ్యాన‌ర్స్ ఈ సినిమాను నిర్మించ‌బోతున్నాయి.