Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ హీరోపై యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ శ్ర‌ద్ధ‌

By:  Tupaki Desk   |   29 Jun 2021 4:30 AM GMT
ఫ్యామిలీ హీరోపై యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ శ్ర‌ద్ధ‌
X
స్టార్ హీరో ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి తమ్ముడు నార్నే నితిన్ చంద్ర హీరోగా అరంగేట్రం చేయనున్న సంగ‌తి తెలిసిందే. నితిన్ చంద్ర హీరోగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో `చట్రం` రీమేక్ తెర‌కెక్కుతోందని క‌థనాలొచ్చాయి. కానీ ర‌క‌ర‌కాల కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడం లేదని తెలుస్తోంది.

బావ‌మ‌రిది నితిన్ తొలి చిత్రంపై తార‌క్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తన తెరంగేట్ర‌ చిత్రానికి సరైన స్క్రిప్ట్ ను ఎంచుకోవడంలో నితిన్ కు మార్గనిర్దేశం చేస్తున్నార‌ట‌. ఎన్టీఆర్- నితిన్ ఇద్దరూ ఇప్ప‌టికే ఓ స్క్రిప్ట్ ని లాక్ చేసినట్లు సమాచారం.

నితిన్ తండ్రి ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాస రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. నితిన్ ఇప్పటికే నటశిక్షణ పొందాడు. సుశిక్షితుడ‌య్యాకే తెరంగేట్రం చేస్తున్నారు. ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలో బయటికి రానున్నాయి.