Begin typing your search above and press return to search.
ఫొటోటాక్ : ఎన్టీఆర్ ఫ్యామిలీ రంగుల పండుగ
By: Tupaki Desk | 10 March 2020 11:22 AM ISTరంగుల పండుగ హోళీని కొందరు నిన్న సెలబ్రేట్ చేసుకుంటే కొందరు నేడు జరుపుకుంటున్నారు. మరికొందరు కరోనా కారణంగా హోళీకే దూరంగా ఉంటున్నారు. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం నేడు హోళీ పండుగను జరుపుకున్నాడు. నేడు కుటుంబ సభ్యులతో హోళీ జరుపుకోవడతో పాటు సోషల్ మీడియాలో హోళీ ఫొటోను షేర్ చేసి అభిమానులకు మరియు ఫాలోవర్స్ కు హోళీ శుభాకాంక్షలను ఎన్టీఆర్ చెప్పాడు.
ఫొటోలో ఎన్టీఆర్ భార్య ప్రణతితో పాటు పిల్లలను కూడా చూడవచ్చు. ఇద్దరు పిల్లలు కూడా చాలా క్యూట్ గా కలర్స్ లో మునిగి పోయి మరింత కలర్ ఫుల్ గా కనిపిస్తున్నారంటూ నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫొటోలు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ ఫొటోలో ఒకేసారి నలుగురు కనిపించడం తో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఎన్టీఆర్ ఈ ఫొటోను పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే వేలల్లో లైక్స్.. షేర్స్.. కామెంట్స్ వచ్చాయి ఇంకా వస్తూనే ఉన్నాయి.
ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నా కూడా కుటుంబ సభ్యులతో హోళీ వేడుక కోసం ఎన్టీఆర్ చిన్న బ్రేక్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చరణ్ తో కలిసి ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. అది వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతుంది. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం విడుదలకు ముందే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. అది వచ్చే సమ్మర్ లో రాబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది.