Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌30లో యంగ్‌ ట్యాలెంటెడ్‌ హీరో!

By:  Tupaki Desk   |   2 March 2021 4:30 AM GMT
ఎన్టీఆర్‌30లో యంగ్‌ ట్యాలెంటెడ్‌ హీరో!
X
ఎన్టీఆర్‌.. త్రివిక్రమ్‌ ల మూవీ పట్టాలెక్కే సమయం దగ్గరకు వచ్చింది. గత ఏడాది సమ్మర్ లో సినిమా ను ప్రారంభించి ఈ ఏడాది సంక్రాంతికి సినిమా ను విడుదల చేయాలని భావించినా కరోనా మహమ్మారి త్రివిక్రమ్‌ ప్లానింగ్ మొత్తం చేంజ్‌ చేసింది. ఇప్పటి వరకు వీరి కాంబో మూవీ పట్టాలు కూడా ఎక్కలేదు. ఎన్టీఆర్‌ ప్రస్తుతం ఆర్‌ఆర్ఆర్ సినిమా షూటింగ్‌ తోనే బిజీ బిజీగా ఉన్నాడు. ఆ సినిమా షూటింగ్‌ పూర్తి అయిన తర్వాతే ఎన్టీఆర్‌ తదుపరి సినిమా ను చేయబోతున్నాడు. ఏప్రిల్‌ నుండి ఎన్టీఆర్ త్రివిక్రమ్‌ మూవీ పట్టాలెక్కుతుందని అంటున్నారు. ఈ సమయంలో సినిమాలోని నటి నటుల ఎంపిక పక్రియతో పాటు సెట్టింగ్‌ లొకేషన్స్ ఇతరత్ర విషయాలను చూసుకుంటున్నారు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలో కీలకమైన హీరో స్నేహితుడి పాత్రను యంగ్‌ ట్యాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టితో వేయించేందుకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్‌ తో పోటీ పడి నటించాలంటే కేవలం నవీన్ వల్లే అవుతుందని యూనిట్ సభ్యులు భావిస్తున్నారట. అందుకే ఆయన్ను ఎంపిక చేసినట్లుగా మీడియా వర్గాల వారు అంటున్నారు. నవీన్ ఇప్పటికే ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో నటుడిగా మంచి మార్కులు దక్కించుకున్నాడు. ప్రస్తుతం జాతిరత్నాలు సినిమా ను చేస్తున్నాడు. ఆ సినిమా విడుదలకు ముస్తాబు అవుతుంది. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్‌ వంటి స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం రావడంతో నవీన్ వదులుకోవాలనుకోలేదట. షూటింగ్‌ ప్రారంభం అయిన తర్వాత ఈ విషయాన్ని అఫిషియల్ గా అనౌన్స్‌ చేయబోతున్నారట.