Begin typing your search above and press return to search.

యంగ్‌ సూపర్ స్టార్.. సీనియర్ సూపర్‌ స్టార్‌ ల మల్టీస్టారర్‌

By:  Tupaki Desk   |   5 Feb 2022 3:30 PM GMT
యంగ్‌ సూపర్ స్టార్.. సీనియర్ సూపర్‌ స్టార్‌ ల మల్టీస్టారర్‌
X
బాలీవుడ్‌ బాద్ షా సూపర్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ హీరోగా విభిన్న చిత్రాల దర్శకుడు రాజ్ కుమార్‌ హిరానీ ఒక సినిమాను తెరకెక్కించబోతున్నాడు. దశాబ్ద కాలంగా సరైన కమర్షియల్‌ హిట్‌ లేక అల్లాడుతున్న షారుఖ్‌ ఖాన్‌ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ కూడా చాలా అంచనాలు పెట్టుకుని మరీ చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన పఠాన్ సినిమాను పూర్తి చేశాడు. ఆ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. మరో వైపు షారుఖ్‌ ఖాన్ రెండు మూడు సినిమాలను చేసేందుకు సిద్దం అయ్యాడు. అందులో రాజ్ కుమార్‌ హిరానీ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా ఒకటి. ఈ సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. సాదారణంగా హిరానీ సినిమాలు కనీసం ఏడాది సమయం పడుతుంది. కాని ఈ సినిమా ను మాత్రం ఆరు నుండి ఎనిమిది నెలల్లోనే పూర్తి చేసేలా ప్లాన్‌ చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఇదే సమయంలో ఈ సినిమాలో మరో హీరో కూడా ఉంటాడనే వార్తలు వస్తున్నాయి.

బాలీవుడ్‌ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం షారుఖ్‌ ఖాన్‌ తో పాటు ఈ సినిమాలో యంగ్‌ సూపర్‌ స్టార్‌ గా పిలవబడుతున్న మోస్ట్ ట్యాలెంటెడ్‌ అండ్‌ క్రేజీ బాలీవుడ్‌ స్టార్‌ విక్కీ కౌశల్‌ ను నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇతర హీరోలతో స్క్రీన్‌ ను షేర్‌ చేసుకునేందుకు సల్మాన్‌ ఖాన్ ఎప్పుడు కూడా సిద్దంగా ఉంటారు. గతంలో ఆయన పలు మల్టీ స్టారర్ సినిమాలు చేశాడు. కనుక విక్కీ కౌశల్‌ తన సినిమాలో నటించేందుకు ఆయన ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తూ క్రేజీ హీరోగా పేరు దక్కించుకున్న విక్కీ కౌశల్‌ కూడా దర్శకుడిపై ఉన్న గౌరవం మరియు షారుఖ్ ఖాన్‌ పై ఉన్న అభిమానంతో మల్టీ స్టారర్ గా చేసేందుకు ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతోంది.

విక్కీ కౌశల్‌ మరియు షారుఖ్‌ ఖాన్‌ ల కాంబోలో రాబోతున్న ఈ సినిమా షూటింగ్‌ అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీ నటుల గురించిన సమాచారం త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది. షారుఖ్ ఖాన్‌ మరియు విక్కీ కౌశల్‌ లు ఇద్దరు కూడా స్టార్‌ డమ్ లో పతాక స్థాయిలో ఉన్నారు. కనుక వీరి మల్టీ స్టారర్ ఖచ్చితంగా మంచి బజ్ ను క్రియేట్‌ చేసే అవకాశం ఉంది. అందుకే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభంకు ముందే భారీగా మార్కెట్‌ ను కలిగి ఉంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విక్కీ కౌశల్ ప్రస్తుతం రెండు మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. అయినా కూడా షారుఖ్ ఖాన్‌ తో నటించేందుకు ఆయన ఓకే చెప్పాడు. ఈ సినిమాలో ఈ ఇద్దరు సూపర్‌ స్టార్స్ పాత్రలు ఎలా ఉంటాయి అనేది ప్రతి ఒక్కరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్న విషయం.