Begin typing your search above and press return to search.
సలార్ లవర్స్.. గేట్ రెడీ
By: Tupaki Desk | 9 April 2023 5:39 PM ISTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతూ ఉన్న మూవీ సలార్. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతూ ఉంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే కన్ఫర్మ్ చేసేశారు. హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథాంశం ఉండబోతుంది.
కేజీఎఫ్ సిరీస్ ని మించి ఈ మూవీ కథ ఉంటుందని టాక్ నడుస్తుంది. ఇక ప్రభాస్ ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా రెండు భిన్నమైన పాత్రలని పోషిస్తున్నారు. రెండు పాత్రల నేపధ్యం విభిన్నంగా ఉంటుందని ప్రచారం నడుస్తుంది. పాన్ ఇండియా స్టార్స్ అయిన ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కావడంతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యి ఉంది. కచ్చితంగా సౌత్ నుంచి మరో వెయ్యి కోట్ల కలెక్షన్స్ ని రాబట్టే చిత్రంగా సలార్ ఉండబోతుంది అని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించి ఇంటరెస్టింగ్ అప్డేట్ ని నెక్స్ట్ వీక్ లో ప్రేక్షకులకి అందించడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.
ఇప్పటికే ఈ మూవీ బిజినెస్ ని నిర్మాత విజయ్ కిరంగదూర్ స్టార్ చేసారు. అన్ని భాషలకి సంబందించిన థీయాట్రికల్ బిజినెస్ క్లోజ్ చేసుకునే పనిలో ఉన్నారు. మొత్తం థీయాట్రికల్ బిజినెస్ 500 కోట్ల వరకు జరుగుతుందని అంచనా వేస్తున్నారు. నాన్ థీయాట్రికల్ రైట్స్ ద్వారా కూడా 100 కోట్లకి పైగా వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇక నెక్స్ట్ వీక్ అప్డేట్ కూడా ప్రమోషన్ స్ట్రాటజీలో భాగంగానే ఇవ్వనున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తుంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపధ్యంలో ఒక్క టీజర్ వదిలితే నెక్స్ట్ లెవల్ హైప్ క్రియేట్ అవుతుందని భావిస్తున్నారు. మరి నెక్స్ట్ వీక్ ఇవ్వబోయే అప్డేట్ ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.