Begin typing your search above and press return to search.

యంగ్ లుక్ .. ఈసారైనా ఫ్యాన్స్ కి న‌చ్చుద్దా?

By:  Tupaki Desk   |   2 Nov 2019 10:53 AM GMT
యంగ్ లుక్ .. ఈసారైనా ఫ్యాన్స్ కి న‌చ్చుద్దా?
X
సీనియ‌ర్ హీరోలు లుక్ ఛేంజ్ కోసం ఎంత‌గా ప్ర‌యాస‌ప‌డుతున్నారో చెప్పాల్సిన ప‌నేలేదు. అయితే స్లిమ్ లుక్ అంద‌రికీ కుదిరే ప‌నేనా? అంటే చెప్ప‌లేం. ప్ర‌స్తుతం నంద‌మూరి బాల‌కృష్ణ యంగ్ లుక్ కోసం ఎంతో త‌పిస్తున్నార‌ట‌. బాల‌య్య యంగ్ లుక్ మెస్మ‌రైజ్ చేసేస్తుంద‌ని.. ఈసారి నంద‌మూరి ఫ్యాన్స్ కి స్పెష‌ల్ ట్రీటివ్వ‌బోతున్నార‌ని ఊద‌ర‌గొట్టేస్తున్నారు. అదే కాదు.. 65 కేజీలకు త‌గ్గేందుకు బాల‌య్య తీవ్రంగా శ్ర‌మిస్తున్నార‌న్న ప్ర‌చారం సాగుతోంది. ఇప్ప‌టికే 105 కేజీల నుంచి 25 కేజీలు త‌గ్గి 80 కేజీల‌కు దిగొచ్చారు. ఇక 65 వెయిట్ తో యంగ్ లుక్ కి మారిపోవాల‌నుకుంటున్నార‌ట‌. అయితే ఇదంతా దేనికోసం అంటే.. బోయ‌పాటి కోస‌మేన‌ట‌. ప్ర‌స్తుతం రూల‌ర్ లో న‌టిస్తున్న‌ బాల‌య్య త‌దుప‌రి బోయ‌పాటి చిత్రం కోసం ఇప్ప‌టి నుంచే రూపాన్ని మార్చేస్తున్నార‌ట‌.

అయితే రూల‌ర్ నుంచి ఇప్ప‌టికే రెండు స్టిల్స్ వ‌చ్చాయి. ఇవేవీ బాల‌కృష్ణ ఫ్యాన్సుకే న‌చ్చ‌క‌పోవ‌డంపై చ‌ర్చ సాగింది. వాటిలో అస‌లు యంగ్ లుక్ ఏదీ అంటూ పెద‌వి విరిచేశారు. ఆ రెండు లుక్స్ అంత బాలేద‌న్న విమ‌ర్శ‌లొచ్చాయి. పండ‌గ వేళ రిలీజ్ చేసిన‌ పోలీస్ లుక్ కానీ.. యాక్ష‌న్ మోడ్ లుక్ కానీ అస్స‌లు బాలేదు. ఆ ఫోటోల్లో ఏజ్ కూడా క‌న‌బ‌డి పోవ‌డంతో ఫ్యాన్స్ గుర్రుమ‌న్నారు.

అయితే మునుముందు మ‌రిన్ని గెట‌ప్స్ ని రివీల్ చేయ‌బోతున్నార‌ట‌. ఈసారి సూప‌ర్ లుక్.. డూప‌ర్ లుక్ అంటున్నారు. అయితే ఇక‌పై రాబోతున్న స్టిల్స్ అయినా ఫ్యాన్స్ కి న‌చ్చుతాయా? అంటూ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌చారంలో దంచుడుకు త‌గ్గ రేంజులో లుక్ ఉంటుందా అంటూ సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. రూల‌ర్ చిత్రానికి కే.ఎస్.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.