Begin typing your search above and press return to search.

జూనియర్​ ఆర్టిస్టును బలిగొన్న కరోనా కష్టాలు!

By:  Tupaki Desk   |   14 Nov 2020 4:42 PM IST
జూనియర్​ ఆర్టిస్టును బలిగొన్న కరోనా కష్టాలు!
X
కరోనా ఎఫెక్ట్​ సినీపరిశ్రమను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టివేసింది. ఈ రంగంమీద ఆధారపడి బతుకుతున్న లక్షలాదిమంది జీవితం దుర్భరంగా మారింది. స్టార్​ ప్రొడ్యూసర్లు, హీరోలు, దర్శకులకు ఏ ఇబ్బంది లేదు. కానీ రోజువారి పనిచేసుకొని కార్మికులు కాలే కడుపుతో కష్టాలు పడుతున్నారు. ఈ రంగం మీద పరోక్షంగా ఆధారపడి బతుకే థియేటర్లలో పనిచేసే కార్మికులు, క్యాంటిన్​ నిర్వాహకులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. అయితే జూనియర్​ ఆర్టిస్టుల జీవితం మరింత దుర్భరంగా మారింది.

సినిమా పరిశ్రమ మాంచి ఊపుమీద ఉన్నప్పుడే వాళ్లు ఎన్నోకష్టాలను పడుతుంటారు. అటువంటిది ఇప్పుడు సినిమా షూటింగ్​లు చాలా మేరకు తగ్గిపోయాయి.

ప్రభుత్వం అనుమతులు ఇచ్చినప్పటికి సరైన మార్కెట్​ ఉంటుందో లేదో తెలియక సినిమాలు తీసేందుకు నిర్మాతలు ముందుకు రావడం లేదు. దీంతో చిన్నచిన్నవేషాలు వేసే జూనియర్​ ఆర్టిస్టులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

హైదరబాద్​లో జూనియర్‌ ఆర్టిస్టుగా పని చేస్తున్న నమో కిరణ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కిరణ్ ఆత్మహత్యకు ప్రేమవిఫలం కావడం, ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తున్నది. గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. కిరణ్​ మృతికి పలువురు జూనియర్​ ఆర్టిస్టులు సంతాపం తెలిపారు. అతడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికసాయం చేయాలని డిమాండ్​ చేస్తున్నారు. కిరణ్​ లాంటి ఎందరో జూనియర్​ ఆర్టిస్టులు హైదరాబాద్​లో కష్టాలు అనుభవిస్తున్నారు. వారికి ప్రభుత్వాలు, సినీపెద్దలు, మా అసోషియేషన్​ సహకారం అందించాలని కోరుతున్నారు.