Begin typing your search above and press return to search.

అవకాశాలు లేక ఓటిటి వైపు అడుగులేస్తున్న యంగ్ హీరోయిన్!!

By:  Tupaki Desk   |   28 Dec 2020 5:30 AM GMT
అవకాశాలు లేక ఓటిటి వైపు అడుగులేస్తున్న యంగ్ హీరోయిన్!!
X
'ఆర్ఎక్స్100' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఢిల్లీ సుందరి పాయల్ రాజపుత్. ఆ సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ పోషించి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఫస్ట్ సినిమానే పెద్ద సక్సెస్ అవ్వడంతో ఇక తెలుగులో బిజీ హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు. క్రేజ్ అయితే వచ్చింది కానీ పాయల్ కు అవకాశాలు పెద్దగా రాలేదు. 'ఆర్ఎక్స్100' తర్వాత 'ఆర్డిఎక్స్ లవ్' అనే మరో బోల్డ్ సినిమాలో నటించింది. ఆ సినిమాతో పాయల్ కుర్రకారుకి మతిపోయే అందాలను ఎరగా వేసింది. కానీ అమ్మడి కెరీర్ లో అది పెద్ద డిసాస్టర్ గా మిగిలిపోయింది. ఆ తర్వాత చేసేదేం లేక బెల్లంకొండ శ్రీనివాస్ 'సీత' సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. ఇక గతేడాది నాగచైతన్య, విక్టరీ వెంకటేష్ ల నటించిన మల్టీస్టారర్ 'వెంకిమామ' సినిమాలో వెంకీకి జోడిగా నటించింది. ఆ సినిమా హిట్ అయినా పాయల్ కి మాత్రం అవకాశాలు రాలేదు.

ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలు ఓటిటిల వైపు మళ్లుతున్నాయి. ఎందుకంటే లాక్ డౌన్ సమయంలో ఓటిటిలే సినీ ప్రేక్షకులకు వినోదాన్ని అందించాయి. ఇప్పుడిప్పుడే థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి కానీ ఓటిటిల వైపే మొగ్గు చూపుతున్నారు ప్రేక్షకులు, సినీతారలు. అటు సినిమాలు చేస్తున్నా ఇటు ఓటిటిలకు ఓకే చెప్పడం మాత్రం ఆపట్లేదు. ఇప్పటికే టాలీవుడ్ ఉన్న మాక్సిమం హీరో హీరోయిన్స్ అంతా ఓటిటి బాట పట్టిన సంగతి తెలిసిందే. తాజాగా అదే బాటలోకి వెళ్తోంది పాయల్ రాజపుత్. యంగ్ డైరెక్టర్ అవినాష్ కోకాటి చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో ఈ వెబ్ ఫిల్మ్ కి ఓకే చెప్పినట్లు సమాచారం. ఆర్ఎక్స్100 తర్వాత అంతటి బలమైన క్యారెక్టర్ పాయల్ కి దొరకలేదు. అయితే ఈ వెబ్ ఫిల్మ్ ఆ లోటు తీర్చనుందట. నటనకు, ఎమోషన్స్ పందించడానికి ఆస్కారం ఉందని పాయల్ పచ్చజెండా ఊపిందట. చూడాలి మరి ఓటిటి అయినా పాయల్ ని బిజీ యాక్ట్రెస్ చేస్తుందేమో..!!