Begin typing your search above and press return to search.

నిధి విషయంలో లక్కు బాగా క్లిక్ అయ్యిందట..!

By:  Tupaki Desk   |   30 March 2021 11:05 AM GMT
నిధి విషయంలో లక్కు బాగా క్లిక్ అయ్యిందట..!
X
ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు స్టార్ హీరోల సరసన నటించేందుకు తహతహలాడుతుంటారు. మాక్సిమం అలాంటి అవకాశం చాలా ఆలస్యంగా లభిస్తుంది. కానీ కొందరికి మాత్రమే స్టార్ హీరోలతో నటించే అవకాశం త్వరగా వస్తుంది. అలాంటి వారినే ఇండస్ట్రీ లక్కీపర్సన్ అంటారు. అలాంటి అవకాశం దక్కించుకుని లక్కీ పర్సన్ అయింది యంగ్ హీరోయిన్ నిధిఅగర్వాల్. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో చేసింది మూడు సినిమాలే కానీ క్రేజ్ మాత్రం ఓ రేంజిలో సొంతం చేసుకుంది. మరి ఇంతకీ ఈమెను లక్కీ అని ఎందుకు అంటున్నారు అంటే.. ప్రస్తుతం అమ్మడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన లీడ్ క్యారెక్టర్ పోషిస్తుంది. పవర్ స్టార్ నటిస్తున్న 'హరిహరవీరమల్లు' సినిమాలో నిధి పవన్ జోడిగా కనిపించనుంది.

ప్రస్తుతం వీరమల్లు సినిమా షూటింగ్ కారణంగా పవన్ కళ్యాణ్ తో కలిసి మాట్లాడే సమయం దొరికినందుకు నిధి చాలా హ్యాపీగా ఫీల్ అవుతోంది. నిజానికి పవన్ కళ్యాణ్ సెట్స్ లోకి వస్తే ఆ పవర్ వేరే ఉంటుందని.. ఆయన నుండి చాలా నేర్చుకోవచ్చు అని భావిస్తుందట నిధి. అలాగే పవన్ వినయం, షూటింగ్ లో కూడా డౌన్ టు ఎర్త్ అని.. చాలా కంఫర్ట్ వాతావరణం కల్పిస్తాడని చెబుతోందట అమ్మడు. మొత్తానికి నిధి తన లైఫ్ లో ఓ బెస్ట్ పీరియడ్ ఎంజాయ్ చేస్తోంది. ఇదిలా ఉండగా.. చారిత్రాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే విడుదల చేసిన గ్లింప్స్ కూడా సినిమా పై మంచి బజ్ క్రియేట్ చేసింది. మరి ఇప్పుడు ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తుంది నిధి లుక్ చూడటానికే. చూడాలి మరి త్వరలో నిధి ఫస్ట్ లుక్ రివీల్ చేస్తారేమో మేకర్స్.