Begin typing your search above and press return to search.

ఛీప్ ప‌బ్లిసిటీ కోసం `ప్ర‌భాస్` పేరు రొంపిలోకి!!

By:  Tupaki Desk   |   3 March 2020 2:00 PM IST
ఛీప్ ప‌బ్లిసిటీ కోసం `ప్ర‌భాస్` పేరు రొంపిలోకి!!
X
ఒక్క ఛాన్స్ ప్లీజ్! అంటూ ఆఫ‌ర్ల కోసం ప్ర‌య‌త్నించే అందాల భామ‌లు ఒక్కోసారి ఛీప్ ప‌బ్లిసిటీకి దిగుతుండ‌డం ప‌రిశ్ర‌మ‌లో హాట్ టాపిక్ అవుతోంది. అందుకోసం ఏకంగా డార్లింగ్ ప్ర‌భాస్ పేరునే ఉప‌యోగించుకోవడాన్ని ఛీప్ ట్రిక్ అంటూ త‌ప్పు ప‌డుతున్నారు? ఇంత‌కీ ఆ ట్రిక్ ప్లే చేసిన భామ ఎవ‌రు? అంటే..

ప్ర‌భాస్ పేరుతో ఆఫ‌ర్ అంటూ ట్రాప్ లో ప‌డి ముంబై వెళ్లిన క‌థానాయిక కృతి గార్గ్ వ్య‌వ‌హారం సంచ‌ల‌న‌మైన సంగ‌తి తెలిసిందే. డార్లింగ్ ప్ర‌భాస్ స‌ర‌స‌న ఆఫ‌ర్ కావాలంటే ఆడిష‌న్స్ కి ముంబై రావాలంటూ కృతి గార్గ్ కు ఫోన్ వెళ్లింద‌ని... అర్జున్ రెడ్డి ద‌ర్శ‌కుడు సందీప్ వంగాను మాట్లాడుతున్నా! అంటూ స‌ద‌రు కేటుగాడు ఫోన్ చేశాడ‌ని నిన్నంతా భ‌జ‌న జ‌రిగింది. ప్ర‌భాస్ తో ఛాన్స్ అన‌గానే ఎగిరి గంతేసిన కృతి వెంట‌నే ముంబైకి వెళ్లింద‌ని చాలానే ప్ర‌చారం సాగింది. ఆ త‌ర్వాత నుంచి త‌న ఫోన్ ప‌ని చేయ‌డం మానేసింది. దీంతో కృతి గార్గ్ కిడ్నాప్ కి గుర‌య్యిందంటూ ఫిలింన‌గ‌ర్ లో క‌ల‌క‌లం రేగింది.

అంతేకాదు `రాహు` సినిమా దర్శకుడు సుబ్బు వేదుల త‌న మూవీ క‌థానాయిక కృతి కిడ్నాపైంది అంటూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో అది కాస్తా సోష‌ల్ మీడియాలోనూ వైర‌ల్ అయిపోయింది. మొత్తానికి ఈ గ‌డ‌బిడ న‌డుమ కృతి గార్గ్ తిరిగి ట‌చ్ లోకి రావ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆక‌తాయి నుంచి ఫోన్ వ‌చ్చింది నిజ‌మే.. ఆడిష‌న్స్ అని పిలిస్తే ముంబై వెళ్లాను అని తెలిపింది. నేను సేఫ్ గానే ఉన్నాన‌ని.. త‌న‌ ఇంట్లోనే ఉన్నాన‌ని కూల్ చేసింది. అయితే ఈలోగా జ‌ర‌గాల్సినంత‌ రాద్ధాంతం జ‌రిగిపోయింది. హీరోయిన్ కిడ్నాప్ అంటూ ప్ర‌చారంతో కృతి పేరు మార్మోగిపోయింది. అప్ప‌టివ‌ర‌కూ అస‌లు ఈవిడ ఎవ‌రో సుబ్బు ఎవ‌రో ఎవ‌రికీ తెలీదు. ఈ ఉదంతంతో ఆ ఇద్ద‌రి పేర్లు మార్మోగాయి.

అయితే ఈ ఇన్సిడెంట్ నిజ‌మేనా? ఛీప్ ప‌బ్లిసిటీ స్టంట్ అనుకోవాలా? అంటూ సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రాహు సినిమా ఇటీవ‌లే రిలీజైంది. ఆ క్ర‌మంలోనే ప‌బ్లిసిటీ కోస‌మే ఈ స్టంట్ వేశారు! అంటూ నెటిజ‌నులు చీవాట్లు పెడుతున్నారు. ముంబైకి వెళ్లాక అల‌సిపోయి ఇంటికి వెళ్లిపోయాన‌ని కృతి మీడియాకి వెల్ల‌డించ‌డం చూస్తుంటే.. ఇదేదో ప్రీప్లాన్డ్ అన్న సంగ‌తి ఇట్టే అర్థ‌మైపోతోంది. ఫోన్ ఛార్జింగ్ అయిపోవ‌డంతో స్విచ్ఛాఫ్ అయ్యింది అని సింపుల్ గా తేల్చేయ‌డంతో ఇది న‌మ్మేలా లేద‌ని విమ‌ర్శిస్తున్నారు నెటిజ‌నం. ఒక్క రోజులోనే ఇంత డ్రామానా!! ఈలోగానే ద‌ర్శ‌కుడు పోలీసుల‌కు ఎందుకు ఫిర్యాదు చేయాల్సొచ్చింది? ఇదంతా ప‌బ్లిసిటీ కోసం ఆడిన డ్రామా.. చీప్ ట్రిక్! అంటూ నెటిజ‌నులు ఓ రేంజులో తిట్టేస్తున్నారు.