Begin typing your search above and press return to search.

పెళ్లి ప‌బ్లిసిటీపై యంగ్ బ్యూటీ గ‌రం!

By:  Tupaki Desk   |   23 Jun 2019 5:12 AM GMT
పెళ్లి ప‌బ్లిసిటీపై యంగ్ బ్యూటీ గ‌రం!
X
అందాల క‌థానాయిక‌ల‌పై గాసిప్పులు ప‌ర‌మ‌ రొటీన్. ఫ‌లానా యువ‌హీరోతో ఎఫైర్ సాగిస్తోంద‌ని.. త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతోంద‌ని.. లేదా స‌హ‌జీవ‌నం చేస్తోంద‌ని.. లేదా కెరీర్ సింకింగ్ లో ఉంద‌ని.. ఇలా ఏవో పుకార్లు షికారు చేస్తుంటాయి. అయితే నిప్పులేనిదే పొగ రాదు! అన్న సామెత చందంగా.. అంతో ఇంతో నిజం లేనిదే ఈ పుకార్లు కూడా పుట్ట‌వు. అయితే స‌ద‌రు యంగ్ హీరోయిన్ ఓ టాలీవుడ్ హీరోని ప్రేమించి.. అటుపై ల‌వ్ లో విఫ‌ల‌మై... ఆ ట్రామాలో కెరీర్ ప‌రంగా పూర్తిగా భేజార‌వ్వ‌డంపై ర‌క‌ర‌కాల వార్త‌లు పుట్టుకొచ్చాయి. తాను ప్రేమించిన యువ‌ హీరోని పెళ్లాడేస్తుంద‌ని అప్ప‌ట్లో జ‌రిగిన ప్ర‌చారంపైనా అంతెత్తున లేచింది.

అయితే ఇటీవ‌ల స‌న్నివేశం మారింది. పాత విష‌యాల్ని మ‌ర్చిపోయి పూర్తిగా కెరీర్ పైనే దృష్టి సారించిన స‌ద‌రు యువ‌నాయిక న‌ట‌న‌పైనే దృష్టి సారిస్తోంద‌ట‌. కెరీర్ ని చ‌క్క‌దిద్దుకుని తిరిగి ట్రాక్ లోకి తెచ్చే టైమ్ లో త‌న‌పై పుట్టుకొచ్చిన తాజా గాసిప్పులు త‌న‌ని తీవ్రంగా హ‌ర్ట్ చేశాయ‌ట‌. త‌న‌కు నిశ్చితార్థ‌మైంద‌ని.. త్వ‌ర‌లోనే ఓ బిజినెస్ మేన్ ని పెళ్లాడేయ‌బోతోంద‌ని ఇటు తెలుగు మీడియా అటు త‌మిళ మీడియాల్లో విపరీతంగా ప్ర‌చారం సాగుతోంది. దీంతో స‌ద‌రు యువ‌క‌థానాయిక మీడియాల‌పై గ‌రం గ‌రంగా ఉంద‌ని తెలుస్తోంది. అంతేకాదు.. త‌న‌పై వ‌స్తున్న వార్త‌ల్లో ఎలాంటి నిజాలు లేవ‌ని త‌న మేనేజ‌ర్ చేత లీకులిస్తుండ‌డం చ‌ర్చ‌కొచ్చింది.

ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా బిజీగా ఉన్నాను. ఈ టైమ్ లో పెళ్లేంటి? నిశ్చితార్థం లేదు.. పెళ్లి లేదు.. అస‌లు బిజినెస్ మేన్ ఎవ‌రో తెలీదు! అనేస్తోంద‌ట‌. అయితే తాను అంటున్న దాంట్లో నిజానిజాలెంతో క‌నిపెట్టాల్సి ఉంది. ప్ర‌స్తుతం ఈ యంగ్ హాట్ బ్యూటీ ఓ యంగ్ ట్యాలెంటెడ్ తెలుగు హీరో కం ఆల్ రౌండ‌ర్ స‌ర‌స‌న న‌టిస్తోంది. ఆ సినిమా త్వ‌ర‌లోనే రిలీజ్ కి రానుంది. మ‌రోవైపు తమిళంలోనూ ఈ హాటీ ప‌లు చిత్రాల్లో న‌టిస్తోంది. ఇంత‌కీ ఎవ‌రీ యంగ్ బ్యూటీ..?