Begin typing your search above and press return to search.

ఫుల్ బిజీగా మారిపోయిన కుర్ర హీరోలు..!

By:  Tupaki Desk   |   9 Dec 2020 10:40 AM IST
ఫుల్ బిజీగా మారిపోయిన కుర్ర హీరోలు..!
X
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల నుంచి ఏడాదికి ఒక సినిమా రిలీజ్ అయితే గొప్ప. ఒకరిద్దరు హీరోలు తప్ప ఎవరూ ఎక్కువ సినిమాలు లైన్ లో పెట్టలేదు. కానీ ఇప్పుడు యువ హీరోలు మాత్రం అలా లేరు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ హవా స్టార్ట్ అవడంతో కుర్ర హీరోలందరూ మరిన్ని ప్రాజెక్ట్స్ లైన్లో పెడుతూ ఫుల్ బిజీగా మారిపోతున్నారు. ఇక వీళ్ల ప‌ని అయిపోయిందిరా అనుకున్న హీరోల చేతి నిండా సినిమాలు ఉన్నాయి. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థ‌లు సైతం వీరితో సినిమాలు చేస్తున్నాయి. కార్తీకేయ‌ - న‌వీన్ చంద్ర‌ - రాజ్ త‌రుణ్ - త‌నీష్ - న‌వ‌దీప్ - మ‌నోజ్ నంద‌న్ - సందీప్ కిష‌న్ - నాగ‌శౌర్య‌ - ఆది సాయికుమార్ త‌దిత‌ర‌లు ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. వీరి డేట్స్ మ‌రో ఏడాదిన్న‌ర వ‌ర‌కు ఖాళీ లేవనంటేనే వీరి డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు.

యువ హీరో నాగశౌర్య ఏషియన్ వారితో 'లక్ష్య' అనే స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాడు. అలానే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో 'వరుడు కావలెను'.. హోమ్ ప్రొడక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక ఓటీటీ రిలీజ్ 'ఒరేయ్ బుజ్జిగా' తో ట్రాక్ లోకి వచ్చిన రాజ్ త‌రుణ్.. విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. అలానే సాంటో(మోహన్ వీరంకి) దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్.. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఓ సినిమాకి రాజ్ త‌రుణ్ కమిట్ అయ్యాడు. ఇక కార్తికేయ ప్రస్తుతం గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో 'చావుకబురు చల్లగా' అనే సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు శ్రీ సరిపల్లి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు.

సందీప్ కిషన్ జాతీయ క్రీడ హాకీ నేపథ్యంలో 'ఏ1 ఎక్స్‌ ప్రెస్' అనే సినిమాలో నటిస్తున్నాడు. 'కసాదా తపదా' అనే ఆంథాలజీలో నటిస్తున్న సందీప్.. మరో రెండు ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టాడని తెలుస్తోంది. ఆది సాయి కుమార్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు దాకా ఉన్నాయని తెలుస్తోంది. 'జంగిల్' అనే హారర్ మూవీతో పాటు 'శశి' అనే సస్పెన్స్ థ్రిల్లర్ షూటింగ్ జరుపుకుంటున్నాయి. నవీన్ చంద్ర నటించిన 'భానుమతి అండ్ రామకృష్ణ' మరియు 'మిస్ ఇండియా' సినిమాలు ఈ ఏడాది ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం మరొకొన్ని ప్రాజెక్ట్స్ తో నవీన్ ఫుల్ బిజీగా ఉన్నాడని తెలుస్తోంది. ఇక త‌నీష్ - న‌వ‌దీప్ - మ‌నోజ్ నంద‌న్ వంటి హీరోలు కూడా వరుసగా సినిమాలు చేస్తున్నారు.