Begin typing your search above and press return to search.

కుర్రహీరోల డిప్రెషన్ మోడ్

By:  Tupaki Desk   |   3 Sept 2019 4:09 PM IST
కుర్రహీరోల డిప్రెషన్ మోడ్
X
ఒకప్పుడు సినిమా పరిశ్రమలో చిన్నా పెద్ద తేడా లేకుండా ఏ హీరో అయినా ఏడాదికి కనీసం ఐదు నుంచి పది సినిమాలు చేసేవాడు. అందువల్ల జయాపజయాలకు అతీతంగా అవకాశాలకు పెద్దగా లోటు ఉండేది కాదు. అప్పట్లో కృష్ణ - చిరంజీవి లాంటి హీరోలు ఒకే సంవత్సరంలో 14 సినిమాలు విడుదల చేసిన రికార్డు ఉందంటే ఇప్పటి తరం నమ్మదేమో. కానీ ఈ జనరేషన్ యూత్ హీరోల పరిస్థితి అలా లేదు.

ఒకటి రెండు ఫ్లాప్స్ వచ్చాయంటే చాలు ముందు వెంటపడిన నిర్మాత మళ్ళీ పిలుస్తాడన్న గ్యారెంటీ లేదు. అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాత పోతే పోయింది లెమ్మని నిర్మాణం కన్నా దీన్ని వదులుకోవడమే సుఖమని భావించిన సంఘటనలూ ఉన్నాయి. ఇలాంటివే కొందరు యూత్ హీరోల మానసిక స్థితి మీద ప్రభావం చూపిస్తున్నాయి

ఏడాది క్రితమే పూర్తయినా ఇప్పటికీ రిలీజ్ కానీ సినిమాతో ఎప్పుడు వస్తుందా అని కౌంట్ డౌన్ పెట్టుకుని అలిసిపోయిన హీరో కథ ఒకరిది. ఒకప్పుడు డేట్ల కోసం వెనకాలే తిరిగిన ప్రొడ్యూసర్లు ఓ డిజాస్టర్ తగలగానే ఫోన్లు లిఫ్ట్ చేయని స్టోరీ ఇంకో హీరోది. పది సంవత్సరాలుగా బాక్స్ ఆఫీస్ మీద దండ యాత్ర చేస్తున్నా సక్సెస్ దక్కని దీనగాథ ఇంకో కథానాయకుడిది. వీళ్లంతా ముప్పై వయసులోని వారే. ఇమేజ్ ఫ్యాన్స్ ఉన్నవాళ్లే.

ఈ కారణాల వల్లే ఈ హీరోలు డిప్రెషన్ కు లోను అయి ఆరోగ్యం మీదకు తెచ్చుకోవడమో రోడ్ల మీద యాక్సిడెంట్లు చేసి చిక్కుల్లో పడటమో చేస్తున్నారు. అయినా ఒకటి రెండు పరాజయాలకే ఇంత క్రుంగిపోతే ఎలా. ఇలా భయపడితే మనమిప్పుడు కొలుస్తున్న సూపర్ స్టార్లు మెగాస్టార్లు ఇన్నేళ్లు పరిశ్రమలో ఉండేవాళ్లా. ఈ సత్యం కుర్ర హీరోలు తెలుసుంటే ఇవాళ కాకపోయినా రేపైనా విజయలక్ష్మి వరించే తీరుతుంది