Begin typing your search above and press return to search.
పాన్ ఇండియా కలలు కంటున్న కుర్ర హీరోలకు చుక్కలు కనిపిస్తున్నాయట..!
By: Tupaki Desk | 24 Jun 2021 8:00 PM ISTటాలీవుడ్ హీరోలందరూ తమ ఫైనల్ డెస్టినేషన్ బాలీవుడ్ అనే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. స్టార్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు అందరూ నేషనల్ వైడ్ క్రేజ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇమేజ్ తో సంబంధం లేకుండా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. దీని కోసం పలువురు బాలీవుడ్ నిర్మాతల సహాయసహకారాలు తీసుకుంటున్నారు. అయితే పాన్ ఇండియా అంటూ పెద్ద పెద్ద కలలు కంటున్న కుర్ర హీరోలకు, వారి సినిమాలకి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయట.
బాలీవుడ్ నిర్మాతలు సినిమాల బడ్జెట్ విషయంలో కరెక్ట్ గా ఉంటారనే విషయం తెలిసిందే. సినిమా మీద ఫ్యాషన్ తో పాటుగా బిజినెస్ గురించి కూడా ఆలోచించే కార్పోరేట్ ప్రొడ్యూసర్స్.. ప్రొడక్షన్ కాస్ట్ ఒక్క రూపాయి కూడా ఎక్కువ కాకూడదనే విధంగా వ్యవహరిస్తుంటారు. సినిమా బడ్జెట్ ఇంత అని ఒక్కసారి లాక్ చేస్తే.. దాంట్లోనే ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మన కుర్ర హీరోలు చేస్తున్న సినిమాలు వాళ్ళ బడ్జెట్ కు లోబడి జరగడం లేదట.
ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైతే బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ అడిగే లెక్కలు.. వాళ్ళతో కమ్యూనికేషన్ వంటివి మన హీరోలకు చిరాకు తెప్పిస్తున్నాయట. ఇక్కడ టాలీవుడ్ నిర్మాతలు హీరోని బట్టి బడ్జెట్ కొంచెం అటు ఇటు అయినా సపోర్ట్ చేస్తుంటారు. కానీ అక్కడ బాలీవుడ్ నిర్మాతలు ముందే బడ్జెట్ ఫిక్స్ చేసుకొని, దానికి తగినట్లుగా బిజినెస్ చేస్తుంటారు. మన హీరోలు చేస్తున్న పాన్ ఇండియా సినిమాల విషయంలో ఇదే జరుగుతోంది. ఈ క్రమంలో ప్రొడక్షన్ కాస్ట్ కొంచెం క్రాస్ అయినా, మన హీరోలు - ప్రొడక్షన్ టీమ్ అక్కడి కార్పోరేట్ సంస్థలతో డీల్ చేయలేకపోతున్నారట. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నిర్మాతలని నమ్ముకున్న కుర్ర హీరోలకి, మన లోకల్ ప్రొడ్యూసర్స్ ఎంత బెటర్ అనే విషయం ఇప్పుడు అర్థం అవుతోందట.