Begin typing your search above and press return to search.

వీడియో: పూరీ పంచ్ లకు కుర్రాళ్ల ఎక్స్ ప్రెష‌న్ అద‌ర‌హో

By:  Tupaki Desk   |   18 May 2020 9:00 AM IST
వీడియో:  పూరీ పంచ్ లకు కుర్రాళ్ల ఎక్స్ ప్రెష‌న్ అద‌ర‌హో
X
పంచ్ డైలాగ్ అంటే పూరీనే రాయాలి. అత‌డి క‌లం నుంచి జాలువారే ప్ర‌తి డైలాగ్ బ్లాక్ బ‌స్ట‌రే. అందులో అత‌డి ప‌ర్స‌న‌ల్ లైఫ్ అనుభ‌వాలుంటాయి. మోసాలు కుట్ర‌ల అనుభ‌వం క‌నిపిస్తుంటుంది. బోలెడంత క‌సితో డైరెక్టుగా మొహంపై కొట్టినట్టు సూటిగా సుత్తి లేకుండా డైలాగులు ఉంటాయి. డైలాగుల్లో జీవం ఉట్టిప‌డుతుంది. మ‌నిషి జీవితంలో ఎదుర‌య్యే ప్ర‌తిదానిని పూరి అంత ప‌వ‌ర్ ఫుల్ గా రాసారు. అందుకే అయ‌న సినిమాల్లో డైలాగుల్ని యూత్ ప‌దే ప‌దే వ‌ల్లిస్తుంటుంది.

పోకిరి-బిజినెస్ మేన్- ఇడియ‌ట్- టెంప‌ర్- గంగ‌తో రాంబాబు- ఇస్మార్ట్ శంక‌ర్ .. ఒక‌టేమిటి పూరి తెర‌కెక్కించిన ప్ర‌తి సినిమాలో పంచ్ డైలాగుల గురించి కొన్నేళ్ల పాటు అభిమానులు మాట్లాడుకున్నారు. ఇప్ప‌టికీ టీవీ చానెళ్లు ప‌దే ప‌దే ఆ పంచ్ ల‌ను రిపీట్ చేస్తూనే ఉంటాయి. త‌మ చానెళ్లలో స్టోరీల‌కు పంచ్ లైన్ల‌కు హెడ్డింగుల‌కు వాడుకుంటారంటే అర్థం చేసుకోవ‌చ్చు.

అయితే ఆ పంచ్ డైలాగుల‌న్నిటినీ ఒకేచోట వినాలంటే ఈ వీడియో చూడాల్సిందే. పూరి వార‌సుడు ఆకాష్ పూరి.. అత‌డి స్నేహితుడు రాహుల్ విజ‌య్ (ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ వార‌సుడు) పూరి పంచ్ ల‌కు ఇచ్చిన ఎక్స్ ప్రెష‌న్స్ ఎంతో ఆక‌ట్టుకున్నాయి. ``వియ్ ల‌వ్ సినిమా. ఎక్స్ ట్రా ల‌వ్ టు పూరి జ‌గ‌న్.. రాహుల్ కాల్స్ ఆకాష్‌..`` అంటూ ఆకాష్ పూరీ స్వ‌యంగా ట్విట్ట‌ర్ లో ఈ పంచ్ డైలాగుల వీడియోని షేర్ చేశారు. ప్ర‌స్తుతం అభిమానుల్లో వైర‌ల్ గా దూసుకెళుతోంది. ఆకాష్ ప్ర‌స్తుతం `రొమాంటిక్` అనే చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. పూరి శిష్యుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ మాయ పేరేమిటో- సూర్య‌కాంతం సినిమాల త‌ర్వాత‌ రాహుల్ విజ‌య్ ప‌లు చిత్రాల‌కు సంత‌కం చేశారు.