Begin typing your search above and press return to search.

మెగాస్టార్‌ తో పోటీ వద్దనుకున్న యంగ్‌ హీరో

By:  Tupaki Desk   |   26 April 2022 9:30 AM GMT
మెగాస్టార్‌ తో పోటీ వద్దనుకున్న యంగ్‌ హీరో
X
టాలీవుడ్‌ సీనియర్ స్టార్ హీరోలు.. యంగ్‌ స్టార్‌ హీరోల సినిమాలు విడుదల అయిన సమయంలో చిన్న హీరోల సినిమాలను విడుదల చేయడం అనేది ఖచ్చితంగా ఆత్మహత్య సదృశ్యం అన్నట్లుగానే భావించాలి. తమ సినిమాను తాము కిల్‌ చేసుకోవడం కోసం అలా స్టార్‌ హీరోలతో పోటీ గా విడుదల చేయడం తప్ప మరేం లేదు అనేది కొందరి అభిప్రాయం. పెద్ద హీరోలతో అసలు ఏ ఒక్క చిన్న హీరో సినిమా విడుదల కావడం జరగదు.

ఒక వేళ అలా చిన్న సినిమాలను పెద్ద సినిమాలకు పోటీగా విడుదల చేసినా కూడా అది అతి అనడం లో సందేహం లేదు. మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ క్రేజీ ఆచార్య సినిమా విడుదల అవుతున్న సమయంలో మీడియం రేంజ్ హీరోలే పక్కకు తప్పుకుని మినిమం రెండు వారాల గ్యాప్ ఉండాలని భావిస్తుండగా ఒక చిన్న హీరో మాత్రం ఆచార్య తో పోటీ పడేందుకు సిద్దం అవ్వడం అందరికి ఆశ్చర్యం కలిగించింది.

శ్రీ విష్ణు హీరోగా కేథరిన్ హీరోయిన్ గా చైతన్య దంతులూరి దర్శకత్వంలో వారాహి చలన చిత్రం బ్యానర్‌ లో సాయి కొర్రపాటి నిర్మించిన చిత్రం 'భళా తందనాన'. ఈ సినిమా విడుదలకు ఇటీవలే డేట్‌ ఫిక్స్ చేశారు. ఆచార్య సినిమా విడుదల అయిన ఒక్క రోజుకు విడుదల చేస్తాం అంటూ ప్రకటించారు. ఏప్రిల్‌ 30వ తారీకున విడుదల చేయాలని భావించారు.

విడుదల తేదీని కూడా ప్రకటించి హడావుడి చేశారు. కాని ఏం అనుకున్నారో ఏమో కాని సినిమా విడుదల తేదీని మార్చుతున్నట్లుగా ప్రకటించారు. ఏప్రిల్‌ 30 వ తారీకున విడుదల చేయాలనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లుగా ప్రకటించారు.

ప్రస్తుతానికి సినిమాను వాయిదా వేస్తున్నాం. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం అంటూ మెగాస్టార్ చిరంజీవి ఆచార్యకు భయపడి నిర్ణయం మార్చుకున్నట్లుగా తెలుస్తోంది.

చిరంజీవి ఆచార్య సినిమా టాక్ తో సంబంధం లేకుండా మినిమం గా రెండు వారాల పాటు జోరు గా వసూళ్లను రాబట్టడం ఖాయం. అలాంటి జోరు మద్య ఈ సినిమాను విడుదల చేయడం నూటికి నూరు పాళ్లు తప్పుడు నిర్ణయం అవుతుంది. అందుకే ఆచార్య సినిమాకు పోటీగా తమ సినిమా విడుదల వద్దనుకున్నట్లుగా భళ తందనాన ను వాయిదా వేసినట్లుగా మేకర్స్ ప్రకటించారు.