Begin typing your search above and press return to search.

సినిమాల నిర్మాతలను మార్చేసిన యంగ్ హీరో..

By:  Tupaki Desk   |   4 May 2020 4:20 PM IST
సినిమాల నిర్మాతలను మార్చేసిన యంగ్ హీరో..
X
టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం రేపిన హీరో విజయ్ దేవరకొండ. ఆ సినిమా సినీ ఇండస్ట్రీ పై చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. మొత్తం సౌత్, నార్త్ ఇండస్ట్రీలన్నీ అర్జున్ రెడ్డి పై కన్నేశాయి. ఆ సినిమాతో హీరోగా విజయ్ దేవరకొండ కేవలం తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర ఇండస్ట్రీలలో కూడా అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయితే అర్జున్ రెడ్డి, గీతగోవిందం సినిమాల హిట్ల తర్వాత విజయ్ కి అన్ని చేదు అనుభవాలే మిగిలాయి. రీసెంట్ గా 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాతో పెద్ద ప్లాప్ నే తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో, డైలాగ్ డెలివరీతో అభిమానులకు చేరువయ్యాడు. హిట్లు ప్లాపులు పక్కన పెట్టి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.

టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ కోసం విజయ్ దేవరకొండ మూడు చిత్రాలకు హామీ ఇచ్చాడట. కానీ డియర్ కామ్రేడ్ పరాజయం తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. యాక్షన్ ఎపిసోడ్లలో పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చుచేసిన తరువాత మైత్రి మూవీస్ వారు విజయ్ తో హీరో అనే సినిమా నిలిపేశారు. విజయ్ ప్రస్తుతం మరో ప్రొడ్యూసర్ కి ఓ సినిమా చేస్తానని హామీ ఇచ్చాడట. ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న ఫైటర్‌ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. విజయ్ చేతిలో శివ నిర్వాణ, మోహనకృష్ణ ఇంద్రగంటి చిత్రాలు ఉన్నాయి. శివ నిర్వాణ ప్రాజెక్ట్ దిల్ రాజు నిర్మిస్తుండగా.. మోహనకృష్ణ సినిమాను మైత్రి మూవీస్ వారు నిర్మిస్తారు. దిల్ రాజు తన సినిమాకోసం ఇంకొంత కాలం వెయిట్ చేస్తాను అనడంతో.. విజయ్ నిర్మాతలను మార్చుకున్నాడట. మైత్రి వారు శివ నిర్వాణ ప్రాజెక్టును, దిల్ రాజు మోహనకృష్ణ ఇంద్రగంటి చిత్రాన్ని నిర్మిస్తారట. ‘వి’ తర్వాత మరోసారి మోహనకృష్ణ ఇంద్రగంటి తో దిల్ రాజు పని చేయనున్నారు.