Begin typing your search above and press return to search.

యంగ్ హీరో వివాహ రిసెప్షన్ క్యాన్సిల్?

By:  Tupaki Desk   |   28 Jan 2021 11:01 AM IST
యంగ్ హీరో వివాహ రిసెప్షన్ క్యాన్సిల్?
X
యంగ్ హీరో వరుణ్ ధావన్ ఇటీవ‌ల‌ తన చిరకాల ప్రియురాలు నటాషా దలాల్ ని పెళ్లాడిన సంగ‌తి తెలిసిన‌దే. జనవరి 26 న బాలీవుడ్ వర్గాలకు ఘ‌న‌మైన‌ రిసెప్షన్ ని ప్లాన్ చేశార‌ని ప్ర‌చార‌మైంది. కానీ ఏం జ‌రిగిందో ఇంత‌వ‌ర‌కూ ఎలాంటి విందు లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

తాజా స‌మాచారం మేర‌కు.. ధావన్ కుటుంబం వివాహ రిసెప్షన్ ఇప్పుడు చేయాల‌నే ఆలోచనను విరమించుకుంది. కోవిడ్ -19 స‌న్నివేశాన్ని దృష్టిలో ఉంచుకునే ఇప్ప‌టికి వాయిదా వేసార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. వరుణ్ కుటుంబం నిర్ణ‌యం ఏమిటి? అన్న‌ది అధికారికంగా తెలియాల్సి ఉంటుంది. ఇక ఈ పెళ్లి సింపుల్ గా 50 మంది అతిథుల స‌మ‌క్షంలో జ‌రిగింది. వేడుక‌కు బిగ్ బి అమితాబ్ కుటుంబాన్ని పిల‌వ‌క‌పోవ‌డంపైనా ఇండ‌స్ట్రీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. అమితాబ్ నే పిల‌వ‌లేద‌ని అలిగి మ‌రో సీనియ‌ర్ న‌టుడు గోవిందా ఈ వివాహానికి డుమ్మా కొట్టారు.

వ‌రుణ్ ధావ‌న్ న‌టించిన కూలీ నంబ‌ర్ 1 ఇటీవ‌లే విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. త‌దుప‌రి ప‌లు క్రేజీ చిత్రాల్ల న‌టించాల్సి ఉంది. జ‌గ్ జ‌గ్ జియో చిత్రీక‌ర‌ణ‌కు వెంట‌నే జాయిన్ కావాల్సి ఉంటుంది. అలాగే హ‌నీమూన్ కోసం కొత్త జంట‌ విదేశాల‌కు వెళ్ల‌నుంద‌‌ని తెలిసింది.