Begin typing your search above and press return to search.

పెద్దోళ్ల పేరు చెబితే తప్పేంటి రాజా

By:  Tupaki Desk   |   16 Nov 2016 10:30 PM GMT
పెద్దోళ్ల పేరు చెబితే తప్పేంటి రాజా
X
ఈ మధ్య ఓ మూవీకి సంబంధించిన ఆడియో సక్సెస్ మీట్ జరిగింది. ఆ కార్యక్రమానికి గెస్ట్ గా హాజరైన హీరో ఒకరు.. ఇద్దరు కుర్ర హీరోలను తెగ పొగిడేశాడు. ఆ ఇద్దరూ కూడా అదే ఈవెంట్ లో ఉన్నారు లెండి. ఇండస్ట్రీలో ఎలాంటి పునాదులు లేకుండా సొంతగా ఎదిగారంటూ బాగానే పొగిడిన ఈ సీనియర్ హీరో(వీళ్లకంటే).. ఆ ఇద్దరిలో ఒకరికి తన మామయ్య సపోర్ట్ కారణంగానే ఇది సాధ్యం అయిందనే విషయం చెప్పేశాడు.

దీంతో పాపం ఆ కుర్రహీరో మొహం చిన్నబోయింది. మామయ్య సపోర్ట్ ఉన్నా.. సొంతగా ఎదిగానని ఆ కుర్ర హీరో ఎంతగా ఫీల్ అయినా.. ఎంట్రీ కోసం మాత్రం సపోర్ట్ తీసుకోలేక తప్పలేదనేది వాస్తవం. కానీ ఆ విషయాన్ని స్టేజ్ సాక్షిగా సీనియర్ హీరో ప్రస్తావించడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఈ విషయాన్ని గమనించిన ఆ సీనియర్ హీరో.. తను కూడా వారసత్వంతోనే ఇండస్ట్రీలోకి వచ్చాననే విషయాన్ని ఒప్పుకున్నాడు. వాళ్లు లేకపోతే తానిక్కడ ఉండేవాడిని కాదని అన్నాడు. అయినా ఆ కుర్రాడు మాత్రం కన్విన్స్ కాలేకపోయాడు.

చిరంజీవి గారు తారు రోడ్డు వేయడం వలనే మేం అందరం ఆ రోడ్డుపై కార్ తోలుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం అంటూ బన్నీ అండ్ చరణ్‌ వంటి హీరోలు చెబుతున్నారు కదా! అలాగే ఈ కుర్ర హీరో కూడా తన మామయ్య పేరు చెప్పుకుంటే ఏమన్నా నష్టపోతాడా ఏంటి? పైగా అలా చెప్పుకోవడం తప్పు కాదసలు. ఏమంటావ్ బ్రదర్?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/