Begin typing your search above and press return to search.

న‌ట‌కిరీటితో యువ‌హీరో శ్రీ‌విష్ణు మ్యాజిక‌ల్ ప్ర‌ద‌ర్శ‌న‌

By:  Tupaki Desk   |   9 March 2021 4:40 AM GMT
న‌ట‌కిరీటితో యువ‌హీరో శ్రీ‌విష్ణు మ్యాజిక‌ల్ ప్ర‌ద‌ర్శ‌న‌
X
లైఫ్ కామెడీ స్లైస్! అంటూ గాలి సంప‌త్ టీమ్ మాంచి జోష్ మీద ఉన్న సంగ‌తి తెలిసిందే. ద‌శాబ్ధాల పాటు తెలుగు ప్రేక్ష‌కుల‌కు త‌న‌దైన విల‌క్ష‌ణ‌త‌తో గొప్ప హాస్యాన్ని అందించిన న‌ట‌కిరీటి రాజేంద్ర‌ప్ర‌సాద్ తో క‌లిసి యువ‌న‌టుడు శ్రీ‌విష్ణు తెర‌పై ఎలాంటి కామెడీ పండించ‌నున్నారు? అన్న‌ది ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

న‌ట‌కిరీటి రాజేంద్ర ప్రసాద్- శ్రీ విష్ణు ప్రధాన పాత్రల్లో నటించిన గాలి సంప‌త్ మార్చి 11న థియేట‌ర్ల‌లోకి రిలీజ‌వుతోంది. అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి అనీల్ రావిపూడి స‌మ‌ర్ప‌కుడు. అనీల్ దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశారు. ఇప్ప‌టికే పోస్టర్లు- టీజర్-ట్రైలర్ ప్రేక్షకులలోకి దూసుకెళ్లింది.

టాలీవుడ్ లో అత్యంత ప్రతిభావంతులైన నటులు ఒకే ఫ్రేమ్ లో సందడి చేయ‌నున్నారు. ఇటీవ‌ల తెలివైన పాత్రల ఎంపిక తో దూసుకెళుతున్నారు. గాలి సంపత్ ఆ కోవకే చెందుతుంద‌‌ని భావిస్తున్నారు. ఇక ఈ మూవీ కోసం శ్రీ‌విష్ణు న‌ట‌న ప‌రంగా చాలా కొత్త‌గా క‌నిపిస్తుంద‌ట‌. న‌ట‌కిరీటితో యువ‌హీరో శ్రీ‌విష్ణు మెస్మ‌రైజింగ్ ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చార‌ని కూడా చెబుతున్నారు. అలాగే రాజేంద్ర ప్రసాద్ అసాధారణమైన నటుడు. నామమాత్రపు పాత్రలు పోషించడం నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ‌గా మారడం వరకు వెండితెరపై తనదైన ముద్ర వేశారు. గాలి సంపత్ (శ్రీ‌విష్ణు) కి రాజేంద్ర ప్రసాద్ ను తండ్రి పాత్రలో క‌నిపిస్తారు. థియేట‌ర్ ఆర్టిస్ట్ కావాల‌నుకునే న‌త్తి తండ్రిగా రాజేంద్ర‌ప్ర‌సాద్ క‌నిపిస్తార‌ని తెలుస్తోంది.

భావోద్వేగాలతో పాటు వినోదం.. కామెడీ.. రొమాన్స్ తో నిండిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని గాలి సంపత్ టీమ్ హామీ ఇచ్చారు. ఈ చిత్రంలో లవ్లీ సింగ్- తనికెళ్ల‌ భరణి- సత్య- రఘు బాబు- శ్రీకాంత్ అయ్యంగార్- మిర్చి కిరణ్- సురేందర్ రెడ్డి- గగన్- మీమ్స్ మధు- అనీష్ కురువిల్లా- రజిత- కరాటే కళ్యాణి- సాయి శ్రీనివాస్- రూపలక్ష్మి త‌దిత‌రులు న‌టించారు. 2021 మార్చి 11 న మహా శివరాత్రి సందర్భంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.