Begin typing your search above and press return to search.
NBK 106లో యంగ్ హీరో.. జాక్ పాట్ ఎవరికి?
By: Tupaki Desk | 27 July 2020 12:00 PM ISTనటసింహా బాలకృష్ణ - బోయపాటి హ్యాట్రిక్ మూవీ నందమూరి వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్. బాలయ్యను రకరకాల గెటప్పుల్లో చూపిస్తూ సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు మాస్ డైరెక్టర్ బోయపాటి. అంతేకాదు.. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో ఓ యంగ్ హీరోకి ఆఫర్ రెడీగా ఉందట. ఇంతకీ జాక్ పాట్ కొట్టేయబోతున్న ఆ యువహీరో ఎవరు? అన్నది తెలియాలంటే మ్యాటర్ లోకి వెళ్లాలి.
ప్రస్తుతం మహమ్మారీ నిర్భంధం వల్ల బోయపాటి మూవీకి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఏమాత్రం ఛాన్స్ దొరికినా త్వరలోనే షెడ్యూల్ పూర్తి చేయాలని వేచి చూస్తున్నారట. అయితే ఈ లాక్ డౌన్ సమయంలో స్క్రిప్టును పూర్తిగా రీమోడల్ చేశారట బోయపాటి. ఆ క్రమంలోనే ఇందులో సమరసింహారెడ్డి తరహా బ్యాక్ డ్రాప్ ని డిజైన్ చేశారు. పైగా ఓ యువహీరో నటించడానికి స్కోప్ కల్పించారట.
బాలయ్య- బోయపాటి సినిమా లో సమరసింహా రెడ్డి సినిమా రేంజ్ బ్యాక్ డ్రాప్ మూవీని పైకి లేపుతుందని.. ఆ సినిమాలో పృథ్వి క్యారెక్టర్ మాదిరిగానే ఇందులో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ఉందని తాజాగా లీకైంది. ఈ రోల్ కోసం నాగ శౌర్య కానీ బెల్లంకొండ శ్రీను కానీ లేదా కళ్యణ్ రామ్ ని కానీ తీసుకుందాం అనే ప్లాన్ లో ఉన్నారట. అయితే ఆ ముగ్గురిలో ఎవరు బెస్ట్ అన్నది బాలయ్య- బోయపాటి బృందం ఇంకా డిసైడ్ చేయాల్సి ఉంది. మరి జాక్ పాట్ ఎవరిని వరిస్తుందో చూడాలి.