Begin typing your search above and press return to search.
డైరెక్టర్స్ కు యంగ్ హీరో ఓపెన్ ఆఫర్
By: Tupaki Desk | 2 Oct 2020 4:20 PM ISTఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా పరిచయం అయిన రాజ్ తరుణ్ కెరీర్ ఆరంభంలో వరుసగా మాస్ హిట్స్ దక్కించుకుని జూనియర్ మాస్ మహారాజా అనిపించుకున్నాడు. అంతలోనే అతడి సినిమాలు నిరాశ మిగల్చడం మొదలు అయ్యాయి. అయినా కూడా పట్టువదలని విక్రమార్కుడి మాదిరిగా రాజ్ తరుణ్ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఈయన చేసిన సినిమా 'ఒరేయ్ బుజ్జిగా' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా రాజ్ తరుణ్ మీడియాతో మాట్లాడుతూ తన భవిష్యత్తు ప్రణాళికను ప్రకటించాడు.
హీరోగానే కాకుండా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను చేసేందుకు తాను రెడీగా ఉన్నట్లుగా చెప్పాడు. ప్రేమ చదరంగం సినిమాలో భరత్ పోషించినటువంటి విలన్ పాత్రను చేయాలని ఉందంటూ రాజ్ తరుణ్ మనసులోని కోరికను చెప్పాడు. అలాంటి పాత్రలతో ఎవరైనా దర్శకులు వస్తే ఖచ్చితంగా చేసేందుకు రెడీగా ఉన్నాను అంటూ పాత కొత్త దర్శకులకు అందరికి కూడా ఓపెన్ ఆఫర్ ను రాజ్ తరుణ్ ఇచ్చాడు. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అయినా మంచి సబ్జెక్ట్ ఉంటే నటించేందుకు రెడీ అన్నాడు.
రాజ్ తరుణ్ ను లవర్ బాయ్ గా మాస్ హీరోగా చూసిన ప్రేక్షకులు విలన్ గా చూస్తారా అంటే అనుమానమే అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా మంచి కథ అయితేనే మంచి పాత్ర అయితేనే రాజ్ తరుణ్ విలన్ గా మెప్పించే అవకాశం ఉంటుందంటున్నారు. రాజ్ తరుణ్ కు విలన్ ఆఫర్ చేసే దర్శకులు ఎవరైనా ఉన్నారా అనేది చూడాలి.