Begin typing your search above and press return to search.

ఆ సినిమా మీద గుర్రుగా ఉన్న హీరో!

By:  Tupaki Desk   |   14 May 2020 4:40 PM IST
ఆ సినిమా మీద గుర్రుగా ఉన్న హీరో!
X
ఆయన పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరో. అయితే ఇప్పటికే మిడ్ రేంజ్ లోనే ఉన్నాడు. మాస్ యాక్షన్ సినిమాలు పెద్దగా కలిసిరాకపోవడంతో కుటుంబ కథా చిత్రాలు.. ప్రేమ కథా చిత్రాలు చేస్తూ మంచి విజయాలు అందుకుంటున్నాడు. ఈ హీరోతో ఒక అభిరుచి గల దర్శకుడు ప్రస్తుతం సినిమాను తెరకెక్కిస్తున్నాడు. లాక్ డౌన్ లేకపోతే ఈ పాటికి సినిమా రిలీజై ఉండేది.

థియేటర్లు మూతపడడంతో సినిమా విడుదల వాయిదా పడింది. ఇదిలా ఉంటే ఈ సినిమా అవుట్ పుట్ పట్ల హీరోగారు కినుక వహించారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అంటే సినిమా అవుట్ పుట్ సరిగా లేదని కాదు.. హీరోగారి పాత్రను హీరోయిన్ పాత్ర డామినేట్ చేసేలా ఉందట. అయితే దీన్ని ఎడిటింగ్ లో ఏదో ఒకలాగా సెట్ చేద్దాంలే అనుకుని హీరోగారు మొదట్లో ఊరుకున్నాడట. అయితే అది వర్క్ అవుట్ అయ్యేలా లేకపోవడంతో మొత్తం రష్ ను రిజెక్ట్ చేశాడని.. దీనికి నిర్మాత కూడా తనవైపు నుండి మద్దతునిచ్చాడని అంటున్నారు.

లాక్ డౌన్ ముగిసిన వెంటనే కొన్ని అవసరమైన పోర్షన్లు రీషూట్ చేసేందుకు ఫిలిం యూనిట్ సన్నాహాలు చేస్తోందట. దీంతో డైరెక్టర్ కూడా కొంత మేర ఒప్పుకున్నట్టే ఉన్నాడట. రీ షూట్ చెయ్యడం తప్పేమీ కాదు కానీ రీ షూట్ తర్వాత సినిమా కథ అటూ ఇటూ అయితేనే సమస్య. అలా జరగకుండా ఈ సినిమా టీమ్ రీషూట్ చేస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు.