Begin typing your search above and press return to search.

ముగ్గురు భామ‌ల‌తో కుర్ర‌హీరో ల‌వ్ గేమ్

By:  Tupaki Desk   |   13 July 2019 5:54 AM GMT
ముగ్గురు భామ‌ల‌తో కుర్ర‌హీరో ల‌వ్ గేమ్
X
బాలీవుడ్ యువ‌హీరోల ప్రేమాయ‌ణాలు ఆల్ టైమ్ హాట్ టాపిక్. ఒక‌రికి బ్రేక‌ప్ చెప్పి ఇంకొక‌రితో డేటింగ్ చేయ‌డం ఇక్క‌డ స‌ర్వ‌సాధార‌ణం. క‌థానాయిక‌ల‌తో డేటింగుల్లో చాక్లెట్ బోయ్ ర‌ణ‌బీర్ సింగ్ పేరు రెగ్యుల‌ర్ గా వినిపిస్తుంటుంది. ఆ త‌ర్వాత ఇటీవ‌ల అంత‌గా పాపుల‌రైన మ‌రొక పేరు సుశాంత్ సింగ్ రాజ్ పుత్. ఈ యంగ్ ట్యాలెంటెడ్ హీరో ఇప్ప‌టికే ముగ్గురు భామ‌తో డేటింగ్ చేసాడ‌న్న ప్ర‌చారం సాగింది.

మూడేళ్ల క్రితం 1-నేనొక్క‌డినే బ్యూటీ కృతిస‌నోన్ తో చెట్టా ప‌ట్టాల్ అంటూ షికార్లు చేయ‌డంపై బాలీవుడ్ మీడియాలో వ‌రుస క‌థ‌నాలొచ్చాయి. ఒకానొక సంద‌ర్భంలో త‌మ మ‌ధ్య రిలేష‌న్ షిప్ పైనా ఓపెన్ గానే చెప్పేసింది ఈ జంట‌. డేటింగ్ లో ఉన్నామ‌ని వేదిక‌ల‌పైనే అంగీక‌రించారు. అయితే కాల‌క్ర‌మంలో ఏమైందో సుశాంత్ నుంచి కృతి విడిపోయింది. అటుపై `కేదార్ నాథ్` సెట్స్ లో ఉన్న‌ప్పుడు సైఫ్ అలీఖాన్ డాట‌ర్ సారా అలీఖాన్ తో సుశాంత్ డీప్ ల‌వ్ లో ఉన్నాడ‌ని ప్ర‌చారం సాగింది. సారా బ‌ర్త్ డే రోజున సుశాంత్ చేసిన సంద‌డి గురించి.. సుశాంత్ బ‌ర్త్ డే మిడ్ నైట్ లో సారా చేసిన సాహ‌సం గురించి క‌థ‌నాలొచ్చాయి.

కేదార్ నాథ్ రిలీజ్ త‌ర్వాత మ‌ళ్లీ ఎవ‌రి దారిలో వాళ్లు కెరీర్ ప‌రుగు మొద‌లు పెట్టారు. ఆ క్ర‌మంలోనే `తూనీగ తూనీగ‌` ఫేం రియా చ‌క్ర‌వ‌ర్తితో సుశాంత్ సింగ్ డేటింగ్ చేస్తున్నాడ‌ని కొత్త ప్ర‌చారం మొద‌లైంది. మేమిద్ద‌రం మంచి స్నేహితులం అంటూ క‌వ‌ర్ చేస్తున్నా బాలీవుడ్ మీడియాలో చిలువ‌లు ప‌లువలుగా క‌థానాలొస్తున్నాయి. ఇటీవ‌ల ఈ జంట‌ లడక్ టూర్ వెళ్ల‌డంతో ల‌వ్ ని క‌న్ఫామ్ చేస్తూ క‌థ‌నాలొచ్చాయి. అక్క‌డ కూల్ వెద‌ర్ లో షికార్లు చేస్తూ ఆ ఫోటోల్ని సామాజిక మాధ్య‌మాల్లోనూ షేర్ చేయ‌డంతో ఈ జంట మ‌ధ్య ఏదో జ‌రుగుతోంద‌న్న ముచ్చ‌టా సాగింది. హాట్ స‌మ్మ‌ర్ లో కూల్ వెకేష‌న్! అంటూ యూత్ సామాజిక మాధ్య‌మాల్లో కామెంట్లు చేశారు. జూలై 1న రియా పుట్టినరోజు సందర్భంగా సుశాంత్ డైమండ్ పెండెంట్ ఒకటి కానుక‌గా ఇచ్చాడ‌ని బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. రియా లైఫ్ లో మ‌ర్చిపోలేని విధంగా బ‌ర్త్ డేని సెల‌బ్రేట్ చేశాడ‌ని క‌థ‌నాలొచ్చాయి. ఇక సుశాంత్ తో ఎంతో సౌక‌ర్యంగా రియా ఫోటోలు దిగుతూ ఆ ఫోటోల్ని షేర్ చేస్తూ చాలానే హ‌డావుడి చేస్తోంది. దీంతో ఇక ఈ జంట మ‌ధ్య డేటింగుని మించి ఇంకేదో జ‌రుగుతోంద‌న్న చ‌ర్చా సాగుతోంది.