Begin typing your search above and press return to search.

మరో పెద్ద బ్యానర్ లో యువ హీరో కార్తికేయ సినిమా..?

By:  Tupaki Desk   |   16 March 2021 11:30 PM GMT
మరో పెద్ద బ్యానర్ లో యువ హీరో కార్తికేయ సినిమా..?
X
యువ కథానాయకుడు కార్తికేయ కెరీర్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌ పై ''చావు కబురు చల్లగా'' సినిమా చేస్తున్న యువ హీరో.. ఇటీవలే సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో ఓ మూవీ అనౌన్స్ చేసాడు. ఈ చిత్రానికి సుకుమార్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించడమే కాకుండా స్టోరీ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ కూడా అందించనున్నారు. ఇలా వరుసగా రెండు పెద్ద బ్యానర్స్ లో సినిమాలు చేస్తున్న కార్తికేయ.. ఇప్పుడు మరో స్టార్ ప్రొడక్షన్ హౌస్ ని లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది.

భారీ బడ్జెట్ సినిమాలతో పాటు మీడియం రేంజ్ సినిమాలు కూడా తీస్తూ మంచి అభిరుచి గల ప్రొడ్యూసర్స్ గా గుర్తింపు పొందిన యూవీ క్రియేష‌న్స్ వారు, ఇప్పుడు కార్తికేయతో ఓ సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే స్టోరీ రెడీగా ఉండగా.. ఫైన‌ల్ సిట్టింగ్స్ వేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ త్వ‌ర‌లోనే ఇవ్వ‌నున్నారు. 'Rx100' సినిమాతో సక్సెస్ అందుకున్న కార్తికేయ.. ఇలా వరుసగా పెద్ద బ్యానర్స్ లో సినిమాలు చేస్తూ క్రేజీ హీరోగా మారిపోతున్నాడు.

ఇదిలా వుండగా కార్తికేయ - లావణ్య త్రిపాఠి జంటగా నటించిన 'చావు కబురు చల్లగా' సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాస్ నిర్మించారు. స్వర్గపురి వాహనం నడిపే బస్తీ బాలరాజు పాత్రలో నటిస్తున్న కార్తికేయ.. ఈ సినిమా మంచి విజయాన్ని అందిస్తుందని నమ్మకంగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మరియు సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలు పెంచాయి. మరి 'చావు కబురు..' సినిమాతో యువ హీరో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడనేది మరో మూడు రోజుల్లో తెలిసిపోనుంది.