Begin typing your search above and press return to search.

టైటిల్ ఫేవరేట్ గా 'బిగ్ బాస్ 5' లోకి యువ హీరో..?

By:  Tupaki Desk   |   17 July 2021 12:30 PM GMT
టైటిల్ ఫేవరేట్ గా బిగ్ బాస్ 5 లోకి యువ హీరో..?
X
టెలివిజన్ స్క్రీన్ పై మోస్ట్ సక్సెస్ ఫుల్ రియాలిటీ షో 'బిగ్ బాస్'. హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో ప్రసారమైన ఈ షో.. తెలుగు బుల్లితెరపై అశేష ప్రేక్షకాదరణ తెచ్చుకుంది. 2017లో ఇక్కడి ప్రేక్షకులకు పరిచయమైన 'బిగ్ బాస్'.. ఇప్పటి వరకు నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఒకదానికి మించి మరొకటి టీఆర్పీ రేటింగ్స్ తెచ్చుకున్నాయి.

ఈ క్రమంలోనే ఇప్పుడు 'బిగ్ బాస్ 5' కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. గత నాలుగు సీజన్ల వల్ల బిగ్ బాస్ ఐదో సీజన్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే నిర్వాహకులు కొత్త సీజన్ కోసం సరికొత్త ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో తెలుగు 'బిగ్ బాస్ 5' గురించి రోజుకో కొత్త పుకారు వస్తూనే ఉంది. అందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి.. హోస్ట్ గురించి.. బిగ్ బాస్ థీమ్ మొదలగు విషయాల గురించి ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కరోనా పరిస్థితుల కారణంగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా నిర్వాహకులు కంటెస్టెంట్స్‌ ను ఎంపిక చేస్తున్నారట.

ఇప్పటికే దాదాపు వంద మందితో చర్చలు జరిపారని.. అందులో కొందరిని జూమ్ మీటింగ్ ద్వారా ఇంటర్వ్యూలు చేశారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ యంగ్ హీరో 'బిగ్ బాస్' హౌస్‌ లోకి ఎంట్రీ ఇస్తున్నాడని రూమర్స్ వస్తున్నాయి.

యాంకర్ కమ్ డైరెక్టర్ ఓంకార్ సోదరుడు, యువ హీరో అశ్విన్ బాబు 'బిగ్ బాస్ 5' లో అడుగుపెట్టనున్నాడట. మంచి డ్యాన్సర్, క్రికెటర్ అయిన అశ్విన్.. 'జీనియస్' సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత 'రాజు గారి గది' 'నాన్న నేను నా బాయ్‌ ఫ్రెండ్స్' 'రాజు గారి గది 2' 'రాజు గారి గది 3' వంటి చిత్రాల్లో నటించాడు.

అయితే త్వరలో రాబోయే 'బిగ్ బాస్' షో లో పార్టిసిపెట్ చేయనున్నాడని.. దీనికి ఓంకార్ బ్యాకప్ కూడా ఉందని అనుకుంటున్నారు. ఇదే కనుక నిజమైతే 'బిగ్ బాస్ 5' ఇంట్రెస్టింగ్ గా మారే అవకాశం ఉంది. అశ్విన్ బాగా హైపర్ గా ఉంటాడు.. బయట నుంచి పబ్లిసిటీ చేయడానికి ఓంకార్‌ ఉన్నాడు కాబట్టి అతను పాల్గొంటే టైటిల్ ఫేవరెట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఏమి జరుగుతుందో చూడాలి.

ఇదిలా ఉంటే 'బిగ్ బాస్ 5' లో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సారి హౌస్‌ లోకి వెళ్ళే సెలబ్రిటీల జాబితా ఇదే నంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసేస్తున్నారు. గెటప్ శ్రీను - యాంకర్ రవి - యాంకర్ వర్షిణి - రఘు మాస్టర్ - ప్రియా - సురేఖ వాణి - నవ్య స్వామి - శ్రీహాన్ - షణ్ముఖ్ జస్వంత్ - హీరోయిన్ ఈషా చావ్లా - సిరి హనుమంతు - లోబో - సింగర్ మంగ్లీ - టిక్ టాక్ స్టార్ దుర్గా రావు - సీరియల్ నటులు సిద్ధార్థ్ వర్మ మరియు అతని భార్య విష్ణు ప్రియ - టీవీ9 ప్రత్యూష - జబర్ధస్త్ నరేష్ వంటి పేర్లు ప్రచారంలో ఉన్నాయి.

అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇకపోతే 'బిగ్ బాస్ 5' ను సెప్టెంబర్ లో స్టార్ట్ చేయాలని 'స్టార్ మా' వారు ఏర్పాట్లు చేస్తున్నారని టాక్. ఆగస్టులో షోకు సంబంధించిన ప్రోమో మరియు లోగో విడుదల చేస్తారని అంటున్నారు. అలానే హోస్ట్ ని కూడా త్వరలోనే ప్రకటిస్తారని టాక్ నడుస్తోంది.