Begin typing your search above and press return to search.

UV బ్యానర్ లో యువ హీరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్..!

By:  Tupaki Desk   |   8 April 2022 10:31 AM GMT
UV బ్యానర్ లో యువ హీరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్..!
X
'ప్రేమతో మీ కార్తీక్' సినిమాతో హీరోగా పరిచయమైన కార్తికేయ గుమ్మకొండ.. 'Rx 100' చిత్రంతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచీ వైవిధ్యమైన కథలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో పెద్ద బ్యానర్లలో అవకాశాలు అందుకుంటున్నాడు.

టాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన యూవీ క్రియేషన్స్ లో కార్తికేయ ఓ సినిమా చేయనున్నాడని గతంలోనే నివేదించాం. తాజాగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. కార్తికేయ కెరీర్ లో రాబోతున్న ఈ 8వ చిత్రానికి ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారని వెల్లడించారు.

''ఒక ఆసక్తికరమైన ప్రయాణం కొనసాగుతోంది! ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో టాలెంటెడ్ యాక్టర్ కార్తికేయతో మా తదుపరి చిత్రాన్ని ప్రకటిస్తున్నాము. షూటింగ్ ప్రోగ్రెస్‌ లో ఉంది'' అని యూవీ క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ సందర్భంగా అనౌన్స్ మెంట్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

కార్తికేయ బ్యాక్ సైడ్ లుక్ ని చూపిస్తున్న ఈ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. బ్యాగ్రౌండ్ లో హైదరాబాద్ నగరాన్ని కూడా చూడొచ్చు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతుందని అర్థం అవుతుంది. #Kartikeya8 కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

యూవీ క్రియేషన్స్ టీమ్ ఓవైపు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాలు నిర్మిస్తూనే.. మరోవైపు మీడియం సినిమాలు తీస్తూ మంచి అభిరుచి గల నిర్మాతలు అనిపించుకున్నారు. ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ రూపొందింస్తున్న మేకర్స్.. ఇప్పుడు యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో కార్తికేయతో సినిమా చేయడానికి రెడీ అయ్యారు.

కార్తికేయ ఇప్పటికే గీతా ఆర్ట్స్ వంటి పెద్ద బ్యానర్ లో ఓ సినిమా చేసాడు. అలానే సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో ఓ మూవీ కమిట్ అయ్యాడు. దీనికి సుకుమార్ నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా స్టోరీ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ కూడా అందించనున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు యూవీ క్రియేషన్స్ వంటి స్టార్ ప్రొడక్షన్ హౌస్ లో మూవీ అనౌన్స్ చేయడం విశేషం. మరి ఈ సినిమాలతో యువ హీరో కెరీర్ గాడిలో పడుతుందేమో చూడాలి.