Begin typing your search above and press return to search.

జీవితాంతం నేను ప్రభాస్ ఫ్యాన్‌.. యంగ్‌ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

By:  Tupaki Desk   |   26 Oct 2022 4:03 AM GMT
జీవితాంతం నేను ప్రభాస్ ఫ్యాన్‌.. యంగ్‌ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌
X
యంగ్ హీరో సంతోష్ శోభన్ సక్సెస్ ఫ్లాప్స్‌ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. చాలా సంవత్సరాల క్రితమే ఈయన హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో కాస్త గ్యాప్ తీసుకుని మళ్లీ సినిమాల్లో ఈ మధ్య ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.

రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత గ్యాప్‌ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. చివరకు వెబ్‌ సిరీస్‌ లను కూడా ఈ యంగ్‌ హీరో వదలకుండా చేస్తూనే ఉన్నాడు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను ఈయన ఇప్పటి వరకు దక్కించుకోలేదు. కానీ ప్రముఖ దివంగత దర్శకుడు శోభన్ తనయుడు అవ్వడం వల్ల చాలా మంది ఇండస్ట్రీకి చెందిన వారు మద్దతుగా నిలుస్తున్నారు.

ముఖ్యంగా ప్రభాస్‌ మద్దతు సంతోష్‌ శోభన్ కి ఉంది అనడంలో సందేహం లేదు. వర్షం సినిమా తో తనకు మంచి బ్రేక్ ఇచ్చిన దర్శకుడి తనయుడు అవ్వడం వల్లనో లేదా మరేదైనా కారణమో కానీ సంతోష్‌ శోభన్‌ కెరీర్‌ విషయంలో ప్రభాస్‌ తనవంతు సాయం చేశాడు.. చేస్తూనే ఉన్నాడు.

కెరీర్‌ ఆరంభం నుండి ప్రభాస్ మద్దతుతో ముందుకు సాగుతున్న సంతోష్‌ శోభన్‌ తాజాగా లైక్‌ షేర్ అండ్ సబ్‌ స్క్రైబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరో సంతోష్‌ శోభన్ మీడియాతో మాట్లాడుతూ తాను జీవితాంతం కూడా ప్రభాస్ ను అభిమానిస్తూనే ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు.

ప్రభాస్ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం అంటూ చెప్పుకొచ్చిన సంతోష్‌ శోభన్‌ ఆయన్ని జీవితాంతం అభిమానిస్తూనే ఉన్నాను అన్నాడు. ప్రభాస్ తన హోం బ్యానర్‌ అయిన యూవీ క్రియేషన్స్ ద్వారా సంతోష్‌ శోభన్ తో సినిమాలు చేయించిన విషయం తెల్సిందే.

కెరీర్ కష్టంలో ఉన్న సమయంలో ప్రభాస్‌ సాయం చేయడం వల్లే సంతోష్‌ శోభన్‌ అలాంటి అభిమానంను చూపిస్తున్నాడు. ప్రభాస్‌ అంటే కేవలం సంతోష్‌ శోభన్ కి మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఆయనను అభిమానించే వారు ఉన్నారు అది వేరే విషయం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.