Begin typing your search above and press return to search.

మతిమరుపు క్యారెక్టర్ లో యంగ్ హీరో..

By:  Tupaki Desk   |   28 March 2020 11:30 PM GMT
మతిమరుపు క్యారెక్టర్ లో యంగ్ హీరో..
X
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస సినిమాల తో బిజీగా కాలాన్ని గడుపుతున్నాడు. రీసెంట్ గా విడుదలైన 'అర్జున్ సురవరం' హిట్ అవ్వడంతో నిఖిల్ మంచి జోష్ లోకి వచ్చాడు. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కార్తికేయ-2లో నటిస్తున్నాడు. ఇప్పుడా కార్తికేయ-2 సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడే హీరో నిఖిల్ తన తదుపరి సినిమా గురించి ప్రకటించిన విషయం తెలిసిందే. కెరీర్ మొదటి నుండి కాన్సెప్ట్ లతో కూడిన సినిమాలు చేస్తున్న నిఖిల్ తాజాగా '18 పేజీలు' సినిమాను ప్రారంభించాడు.

ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ కథ, స్క్రీన్ ప్లేను అందిస్తుండటం విశేషం. సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజా కథనాల ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా అను ఇమ్మాన్యుయేల్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట దర్శక నిర్మాతలు. ఈ సినిమా గురించి ఇంకో క్రేజీ న్యూస్ ఏంటంటే.. ఇందులో హీరో పాత్ర మతిమరుపుతో బాధ పడుతుందట. ఈ మతిమరుపు కాన్సెప్ట్ పై చాలా చిత్రాలు వచ్చినా ఈ సినిమాలో ఇంకాస్త వెరైటీ ఉండబోతుంది అంటున్నారు చిత్రయూనిట్. చూడాలి మరి ఈ '18 పేజీలు' సినిమా అయినా నిఖిల్ కి సరైన బ్లాక్ బస్టర్ ని అందిస్తుందేమో..!