Begin typing your search above and press return to search.

అతి నమ్మకంతో నష్టపోయిన కుర్ర హీరో

By:  Tupaki Desk   |   1 Sep 2018 8:04 AM GMT
అతి నమ్మకంతో నష్టపోయిన కుర్ర హీరో
X
ఈ మధ్యే ఒక మంచి సక్సెస్ ను దక్కించుకున్న ఒక కుర్ర హీరో భారీ బడ్జెట్ తో ఒక సినిమాను చేయడం జరిగింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఆ చిత్రం ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది అంటూ రివ్యూలు వచ్చాయి. ప్రేక్షకుల టాక్‌ కూడా అలాగే ఉంది. ఆ చిత్రం హీరో సొంత బ్యానర్ లో శ్రుతిమించిన బడ్జెట్ తో తెరకెక్కింది అంతకు ముందు ఆయన చేసిన చిత్రంతో మంచి లాభాలను దక్కించుకున్నాడు. ఇప్పుడు అదే నమ్మకంతో మళ్ళి ఎక్కువ ఖర్చు చేయడం జరిగింది.

తన మార్కెట్‌ తో సంబంధం లేకుండా ఆ చిత్రాన్ని నిర్మించినందుకు సదరు హీరో ప్రస్తుతం భారీ లాస్‌ ను మూట కట్టుకోవాల్సిన పరిస్థితి. విడుదలకు ముందే ఆ చిత్రం మంచి రేటుకు అమ్ముడు పోయింది అంటూ వార్తలు వచ్చాయి. కాని అవన్ని కూడా సినిమా పబ్లిసిటీ కోసం చేసిన లీక్స్‌ అంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. చిత్రంకు దాదాపు 6 కోట్ల మేరకు ఈ కుర్ర హీరో నష్టపోయే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు.

తన గత చిత్రం ను 10 కోట్ల బడ్జెట్‌ తో తెరకెక్కించి విడుదల చేసిన ఇతను ఆ చిత్రం సక్సెస్‌ కావడంతో దాదాపు 5 కోట్ల వరకు లాభాలు దక్కించుకున్నట్లుగా సమాచారం. ఇప్పుడు గత చిత్రానికి వచ్చిన లాభంను మించి నష్టం మిగలబోతున్నట్లుగా ట్రేడ్‌ విశ్లేషకులు చెబుతున్నారు. అన్ని సార్లు అదృష్టం కలిసి రాదనే విషయాన్న మర్చి ఈ చిత్రాన్ని చేసిన ఈ కుర్ర హీరో కు ఇది చాలా పెద్ద షాక్‌ అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.