Begin typing your search above and press return to search.

విలక్షణ నటుడిని కలిసిన యంగ్ హీరో ధృవ్ విక్రమ్!

By:  Tupaki Desk   |   11 April 2021 10:30 AM GMT
విలక్షణ నటుడిని కలిసిన యంగ్ హీరో ధృవ్ విక్రమ్!
X
విజయ్ సేతుపతిని కేవలం హీరో అని మాత్రమే అనుకోలేం. ఎందుకంటే తనని ఆ ప్రరిధిలో మాత్రమే చూడవద్దని ఆయనే చెప్పాడు. తాను నటుడిని .. తనకి నచ్చిన పాత్రలను చేసుకుంటూ వెళతానని ఆయన ఓ ఇంటర్వ్యూల్లో అన్నాడు. అలాగే ఆయన కోలీవుడ్ లోనే కాదు, ఇతర భాషల్లోను విలన్ గా చేస్తున్నాడు. ఇప్పుడు ఆయనకి కోలీవుడ్లోనే కాదు .. ఇతర భాషల్లోను విలక్షణ నటుడిగా విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయనతో కలిసి నటించడానికి స్టార్ హీరోయిన్స్ పోటీపడుతుంటారు. అలాంటి విజయ్ సేతుపతిని యంగ్ హీరో ధృవ్ విక్రమ్ కలిశాడు.

కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో విక్రమ్ స్థానం ప్రత్యేకం. ప్రయోగాత్మక చిత్రాలకు ఆయన కేరాఫ్ అడ్రెస్ గా కనిపిస్తుంటాడు. ఈ మధ్యనే ఆయన 'అర్జున్ రెడ్డి' రీమేక్ తో తనయుడిని కోలీవుడ్ కి పరిచయం చేశాడు. ప్రస్తుతం తను నటిస్తున్న 60 సినిమాలో ధృవ్ కూడా కనిపించేలా చూస్తున్నాడు. తండ్రికి తగిన తనయుడు అనిపించుకోవాలనే కసితో ధృవ్ ఉన్నాడు. యువ దర్శకులు తెచ్చే కథలను తండ్రితో కలిసి వినడంలో కుర్రాడు చాలా బిజీగా ఉన్నాడని అంటున్నారు.

అలాంటి ధృవ్ .. విజయ్ సేతుపతి రీసెంట్ గా తారసపడ్డారట. ఇద్దరూ కాలిసి కాసేపు ముచ్చటించుకున్నారు. ఒకరి సినిమా విశేషాలను గురించి ఒకరు తెలుసుకున్నారు. విజయ్ సేతుపతి సహజమైన నటనను గురించి ధృవ్ ప్రశంసిస్తే, యంగ్ హీరోలకి ధృవ్ కచ్చితంగా గట్టి పోటీ కావడం ఖాయమంటూ ఆయనలో విజయ్ సేతుపతి కాన్ఫిడెన్స్ ను పెంచాడట. ఆ సందర్భంలోనే వాళ్లిద్దరూ ఇలా సెల్ఫీ తీసుకున్నారట. ప్రస్తుతం విజయ్ సేతుపతి చేతిలో 13 సినిమాలకి పైగా ఉన్నాయి. మరో మూడేళ్ల వరకూ ఆయన డేట్స్ లేవంటే ఆయన డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.