Begin typing your search above and press return to search.
2024 ఎన్నికల్లో పోటీ చేయబోతున్న దర్శక నిర్మాత
By: Tupaki Desk | 12 May 2020 9:30 AM ISTమధుర శ్రీధర్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఆడియో కంపెనీతో ప్రస్థానం ఆరంభించి.. ఆ తర్వాత దర్శకుడిగా మారి.. ఆపై నిర్మాతగానూ వరుసగా సినిమాలు చేసిన వ్యక్తి మధుర శ్రీధర్. ఐతే స్నేహగీతంతో దర్శకుడిగా అరంగేట్రంలోనే సత్తా చాటినా.. ఆ తర్వాత అంచనాల్ని అందుకో లేకపోయాడాయన. నిర్మాతగా ఆసక్తికర కాంబినేషన్లు సెట్ చేయగలిగాడు కానీ.. పెద్దగా సక్సెస్‌లు మాత్రం అందుకోలేదు. కొణిదెల నిహారికను కథానాయికగా పరిచయం చేస్తూ చేసిన ఒక మనసు, వంశీ దర్శకత్వంలో నిర్మించిన ఫ్యాషన్ డిజైనర్.. ఆనంద్ దేవరకొండ-శివాత్మిక జంటగా నటించిన దొరసాని.. ఇంకా కొన్ని సినిమాలు దారుణమైన ఫలితాన్నందుకున్నాయి. అయినా మధుర శ్రీధర్ ప్రయత్నం మాత్రం ఆపలేదు. ప్రస్తుతం ఆయన నిర్మాణంలో రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో తన పొలిటికల్ వ్యూస్ బయటపెట్టడానికి మధుర శ్రీధర్ ఎప్పుడూ వెనుకాడడు. ఆయన భారతీయ జనతా పార్టీ మద్దతుదారన్న సంగతి ఫాలోవర్లందరికీ తెలుసు. భవిష్యత్తులో మధుర శ్రీధర్ రాజకీయారంగేట్రం చేస్తాడనే అంచనా వాళ్లందరికీ ఉంది. ఈ విషయాన్ని శ్రీధర్ కూడా ఓ ఇంటర్వ్యూలో ధ్రువీకరించాడు. 2024 ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నట్లు ప్రకటించాడు. అంతకంటే ముందే రాజకీయ తీర్థం పుచ్చుకుంటానన్నాడు. శ్రీధర్ బీజేపీలో చేరతాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలంగాణలో ఆ పార్టీ బలాన్ని బట్టి చూస్తే శ్రీధర్ లాంటి తెలివైన.. డబ్బు - ఐడియాలజీ - పాపులారిటీ కూడా ఉన్న వ్యక్తికి టికెట్ దక్కడం పెద్ద కష్టం కాకపోవచ్చు. హైదరాబాద్ పరిధిలోనే ఏదో ఒక నియోజకవర్గం నుంచి శ్రీధర్ ఎమ్మెల్యే గా పోటీ చేసే అవకాశముంది.