Begin typing your search above and press return to search.
బాలయ్యతో ఈసారి ఓకే చెప్పించిన దర్శకుడు
By: Tupaki Desk | 31 July 2020 11:40 AM ISTదర్శకుడు అనీల్ రావిపూడి వరుస చిత్రాలతో సక్సెస్ లను దక్కించుకుంటున్నాడు. ఎఫ్ 2 చిత్రంతో గత ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ఈ ఏడాది సంక్రాంతికి సక్సెస్ లను దక్కించుకున్న అనీల్ రావిపూడి వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా మరో సక్సెస్ దక్కించుకుని హ్యాట్రిక్ దక్కించుకోవాలని ప్రయత్నించాడు. కాని ఆయన జోరుకు కరోనా బ్రేక్ వేసింది. ఎఫ్ 3 స్క్రిప్ట్ ను రెడీ చేసిన అనీల్ రావిపూడి ఆ సినిమాను ఇప్పట్లో మొదలు పెట్టడం సాధ్యం కాదని తేలిపోయింది. ఎందుకంటే వరుణ్ తేజ్ మరియు వెంకటేష్ లు ఇతర సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఆ సినిమాలు పూర్తి అయితే కాని ఎఫ్ 3 కి డేట్లు ఇవ్వలేరు. కనుక ఎఫ్ 3 ని పట్టుకుని ఉంటే చాలా సమయం వృదా అవుతుందనే ఉద్దేశ్యంతో అనీల్ రావిపూడి కొత్త సినిమాను ప్లాన్ చేస్తున్నాడు.
గతంలో బాలకృష్ణ తో సినిమా చేయాలని అనీల్ రావిపూడి తీవ్రంగా ప్రయత్నించాడు. కాని అప్పుడు కొన్ని కారణాల వల్ల బాలయ్యతో అనీల్ కాంబో సెట్ అవ్వలేదు. రామారావు గారు అనే టైటిల్ ను కూడా అనుకున్నట్లుగా ప్రచారం జరిగింది. కాని బాలయ్య కు అప్పటికి అనీల్ పై నమ్మకం కుదరలేదో లేకుంటే స్క్రిప్ట్ నచ్చలేదేమో కాని ఆ సినిమాను పక్కన పెట్టారు. అప్పుడు నో చెప్పిన బాలయ్యతో తాజాగా మరోసారి కలిసి ఓకే చెప్పించాడట అనీల్. యాక్షన్ ఎంటర్ టైనర్ స్క్రిప్ట్ తో బాలయ్య ను ఈసారి అనీల్ మెప్పించాడంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సినిమా తెరకెక్కుతోంది. అందుకు సంబంధించిన చిత్రీకరణ సగంలో ఉండగా కరోనా కారణంగా చిత్రీకరణ ఆగిపోయింది. ఈ ఏడాది చివరి వరకు సినిమాను మళ్లీ ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలోనే అనీల్ రావిపూడికి బాలయ్య డేట్లు ఇచ్చే అవకాశం ఉందట. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాదిలో దసరా కానుకగా సినిమాను విడుదల చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయట.